కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌కు త‌మ్ముడైన కార్తీ తెలుగులో కూడా త‌న సినిమాల‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. గ‌తేడాది కాష్మోరా సినిమాతో మ‌న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి మార్కులు వేయించుకున్న కార్తీ తాజాగా ఈ రోజు ఖాకి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. పీఎస్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. రిలీజ్‌కు ముందే టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో మంచి హైప్ తెచ్చుకున్న  ఈ సినిమా ఈ రోజు తెలుగుతో పాటు త‌మిళ్‌లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. మ‌రి ప్రీమియ‌ర్ షో టాక్ ప్ర‌కారం ఖాకి ఎలాంటి టాక్ తెచ్చుకుందో ?  చూద్దాం.

Image result for karthi khaaki movie

ఇక క‌థ‌, క‌థ‌నాల విష‌యానికి వ‌స్తే హీరో కార్తీ పోలిస్ అధికారిగా న‌టించాడు. హీరోయిన్ ర‌కుల్ ప‌ల్లెటూరి అమ్మాయిగా న‌టించింది. సినిమా అంతా దొంగ‌ల ముఠాను వేటాడే ఇన్వెస్ట్‌గేష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సాగుతుంది. కార్తీ గ‌తంలో చేసిన సినిమాల‌కు ఈ సినిమాకు చాలా వైవిధ్యం ఉంది. సినిమా స్టార్టింగ్‌లో హీరో కార్తి, హీరోయిన్ ర‌కుల్ మ‌ధ్య కొన్ని ప్రేమ స‌న్నివేశాలు ఉంటాయి. ఆ త‌ర్వాత అస‌లు క‌థ స్టార్ట్ అవుతుంది. 


విలన్లు, పోలీసుల మ‌ధ్య సాగిన స‌న్నివేశాలు ఉత్కంఠ‌భ‌రితంగా ఉండి సినిమా రేంజ్‌ను, గ్రాఫ్‌ను ఒక్క‌సారిగా పెంచాయి. ద‌ర్శ‌కుడు వినోద్ సినిమా కోసం క్లీయ‌ర్ స్క్రిన్ ప్లే రాసుకున్నాడు. కార్తీ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయ‌డంతో పాటు  ఈ పాత్ర‌కు క‌రెక్టుగా సెట్ అయ్యాడు. ఇక సినిమాలో ప్ర‌ధాన విల‌న్‌ను వేటాడేందుకు కార్తీ వేసే ఎత్తులు, ప్లాన్లు ఆస‌క్తిగా ఉంటాయి.


సినిమా ఫస్టాఫ్ అంతా డీసెంట్‌గా ఉన్నా సెకండాఫ్ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ముందుకు వెళుతుంది. ఇక డైలాగ్స్ కూడా బాగున్నాయి. యాక్ష‌న్ అదిరిపోయింది. ఓవ‌రాల్‌గా ఇన్వెస్ట్‌గేష‌న్‌తో పాటు యాక్ష‌న్ అదిరిపోయింది. యాక్ష‌న్ ప్రియుల‌కు మంచి విందు భోజ‌నం లాంటి సినిమా ఈ ఖాకి.


మరింత సమాచారం తెలుసుకోండి: