టాలీవుడ్ దర్శకుడు అయిన గుణశేఖర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిధ తన ట్వీట్స్,కామెంట్స్ తో విరుచుక్కుపడతున్నాడు. దీనికి కారణం తను స్వయంగా డైరెక్ట్ చేసి నిర్మించిన చిత్రం రుద్రమదేవి దేవి కి కనీసం ఒక్కకేటగిరి లో కూడా అవార్డులో రాకపోవడమే.

సినిమా వల్ల లాభాల్లు రాకపోయిన బాధ లేదు కానీ అవార్డు రాకపోవడం చాలా దురధృష్టకరం అని అన్నాడు. ఎవడో ఒకడు చరిత్రను పరిశోధించి సినిమా తీశాడు. ఇప్పుడు ఆ తీసిన వాడికి అవార్డును ఇచ్చి మరలా చరిత్రను గుర్తుకు తేవడం ఎందుకు ? అని భావించారా? అని సెటైర్ వేశాడు.

రుద్రమదేవి సినిమా తీసినందుకు నన్ను క్షమించండి అంటూ........ఏమైన మాట్లాడితే మరో మూడేళ్ళు బ్యాన్ చేస్తామని అనడం  బెదిరించడమే అని అన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. గుణశేఖర్ టీవీ లకి ఎక్కి టీవీ లలో సైతం తన వాదన, బాధ వెలిబుచ్చుతూ ఉంటె ఈ టైం లో ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకి వచ్చి స్పందించడం లేదు.

ఇష్టం వచ్చినట్టు వాగే వర్మ లాగా కాదు కదా గుణశేఖర్ అనే మనిషి? చక్కగా గౌరవ ప్రదంగా తన ఆవేదన చెప్పుకున్నారు ఆయన అలాంటి వారికి కూడా ఆన్సర్ లు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారో మరి అర్ధం కాని పరిస్థితి. బాలయ్య నే అందరూ కేంద్రీకరించి అందరూ బాలయ్య నే వేలెత్తి చూపుతున్న ఈ తరుణం లో బాలయ్య గుణశేఖర్ ని కలిసి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బాలయ్య తీసుకుంటే బాగుంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: