‘మనం’ సినిమాతో అక్కినేని కుటుంబానికి మరపురాని హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ అఖిల్ రెండో సినిమా ‘హలో’ బాధ్యతలను స్వీకరించి అఖిల్  కెరియర్ లో ఒక మరుపురాని ఘన విజయంగా ‘హలో’ ని మార్చడానికి చాలా కష్టపడుతున్నాడు. దీనికి బలంచేకూర్చే విధంగా   లేటెస్ట్ గా విడుదలైన ‘హలో’ టీజర్ ను చూసినవారికి అఖిల్ మరోసారి యాక్షన్ జోనర్ ను ఎంచుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.  ఈటీజర్ పై ఇప్పటికే అనేకమంది ప్రశంసలు కురిపిస్తునారు. 

అయితే ఎంతటి గొప్పవ్యక్తిని అయినా తన సెటైర్లతో ఇరుకున పెట్టె రామ్ గోపాల్ వర్మ నాగార్జున కొడుకు అఖిల్ ను ఆకాశానికి ఎత్తేస్తూ చేసిన కామెంట్స్ వెనుక కొన్ని సెటైర్లు ఉన్నాయా  అన్న కోణంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అయితే అక్కినేని నాగార్జునతో ‘శివ’ టైమ్ నుంచి ఉన్న రిలేషన్ కారణంగా వారిపై ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ చేయని  వర్మ అఖిల్ పై చేసిన పొగడ్తల వెనుక కూడ కొన్ని చురకలు ఉన్నాయా అనే కోణంలో కూడ మాటలు వినిపిస్తున్నాయి. నాగార్జునతో ఒక  సినిమాను మరో మూడు రోజుల్లో స్టార్ట్ చేయాల్సిన వర్మ అఖిల్ ‘హలో’ పై వ్యూహాత్మకంగా స్పందించాడు. 

‘హలో’ టీజర్ ను చూసిన వర్మ కామెంట్ చేస్తూ ఈప్రాజెక్టుతో లింక్ అయిన వాళ్లందరూ తమ మనసు చెప్పింది చేశారే తప్ప అరిగిపోయిన మూస పద్ధతుల వైపు వెళ్లలేదన్నాడు. అంతేకాదు  ఈదర్శకుడు వ్యూయర్ ను ఇంప్రెస్ చేయలేమేమో అనే భయాన్ని పెట్టుకోకుండా నిజాయితీగా తాను  చూపించాలనుకునే సినిమాను చూపించబోతున్నాడు అని కామెంట్స్ చేసాడు. ఇక అఖిల్ పై చేసిన కామెంట్స్ మరీ ఇంట్రెస్టింగ్ గా ఉండటమే కాకుండా  అత్యంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. "హేయ్ అఖిల్ అక్కినేని నీలో ఉన్న ఈట్యాలెంట్స్ అన్నీ మొదటి సినిమా విషయంలో ఎక్కడ దాచి పెట్టావ్ మొత్తానికి నువ్వేంటో చూపించబోతున్నావ్. డిసెంబర్ 22న నాతో సహా ఆడియన్స్ అందరూ మెస్మరైజ్ కావడం ఖాయం" అంటూ కామెంట్ చేసాడు. 

అయితే వర్మ కామెంట్స్ ను లోతుగా విశ్లేషిస్తున్న వారు మాత్రం ప్రేక్షకులను  ఇంప్రెస్ చేయలేమేమో అనే భయాన్ని పెట్టుకోకుండా నిజాయితీగా తాను  చూపించాలనుకునే సినిమాను విక్రమ్ కుమార్ చూపించబోతున్నాడు అనివర్మ చేసిన కామెంట్స్ ను బట్టి అఖిల్ విక్రమ్ కుమార్ ప్రయోగంలో చిక్కుకున్నాడు అనే సంకేతాలు ఇస్తున్నాడా ? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఏమైనా వర్మ మాటలకు రెండువైపులా కత్తికి మించిన పదును ఉంటుంది అని మరోసారి నిరూపించాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: