మెగా డాటర్ నిహారిక మొదటి సినిమా ఒక మనసు నిరాశ పరచగా ఆ దెబ్బకు అమ్మడు ఏడాది దాకా మరో సినిమా చేయలేదు. ఇక ఈ గ్యాప్ లోనే నిహారిక తమిళ సినిమా కమిట్ అవడం జరిగింది. ఆ సినిమా దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తుంది. ఆ సినిమాలోని నిహారిక లుక్ ఈమధ్యనే సోషల్ మీడియాలో రివీల్ అయ్యింది.


ఇక తెలుగులో నిహారిక చేస్తున్న రెండో సినిమా ఎనౌన్స్ చేశారు. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే నిరాశకు ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ రావడంతో వెనక్కి తగ్గారని టాక్. సుమంత్ అశ్విన్ హీరోగా నిహారిక తో హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా షురూ చేశారు. కాని ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే నిర్మాతలు వెనక్కి తగ్గారట.


సో మెగా డాటర్ మళ్లీ కష్టాల్లో పడ్డదని తెలుస్తుంది. నూతన దర్శకుడు డైరెక్ట్ చేయబోయే ఈ సినిమా కథ నచ్చడంతో నిర్మాతల గురించి పట్టించుకోకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట నిహారిక. తీరా సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికే కష్టాలు పడాల్సి వస్తుందట. అందుకే ఇక నిహారిక ఆ సినిమా నుండి క్విట్ అవుతున్నట్టు తెలుస్తుంది.


ఇక మీదట ఇలాంటివి మళ్లీ రిపీట్ అవకుండా కాస్త ఆచి తూచి అడుగులేయాలని చూస్తుందట. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన అమ్మాయికి ఇలాంటి చేదు అనుభవం నిజంగా దురదృష్టమని చెప్పాలి. మరి నిహారిక రానున్న సినిమాలకైనా మంచి నిర్ణయాలను తీసుకుంటుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: