స్వీటీ అనుష్క హీరోయిన్ గా యువి క్రియేషన్స్ బ్యానర్లో పిల్ల జమిందార్ అశోక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా భాగమతి. రీసెంట్ గా అనుష్క బర్త్ డే నాడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అసలైతే సినిమా ఈపాటికల్లా రిలీజ్ కావాల్సి ఉన్నా గ్రాఫిక్స్ వల్ల లేట్ అవుతూ వచ్చింది.


అయితే ఫస్ట్ లుక్ చూశాక సినిమాకు గ్రాఫిక్స్ కచ్చితంగా ప్రాధాన్యత ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అందుకే సినిమా రిలీజ్ కోసం ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక డిసెంబర్ లో రిలీజ్ ఉంటుంది అనుకున్న భాగమతి సినిమా రిలీజ్ ను జనవరికి పోస్ట్ పోన్ చేశారు దర్శక నిర్మాతలు. అఫిషియల్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.


జనవరి 26న భాగమతి ప్రేక్షకుల ముందుకు వస్తుందట. ఎలాగు సంక్రాంతి బరిలో స్టార్ సినిమాలు వస్తుండగా ఆ సినిమాల హడావిడి తగ్గా రెండు వారాలకు భాగమతి సినిమా రాబోతుంది. సినిమా కచ్చితంగా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. 


బాహుబలి తర్వాత అనుష్క చేస్తున్న ఈ డిఫరెంట్ రోల్ ఆమె అభిమానులకే కాదు సిని ప్రియులకు మంచి ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. మరి నిజంగా భాగమతి అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందా లేదా అన్నది రిలీజ్ అయితేనే గాని చెప్పలేం. జనవరి 26 రిపబ్లిక్ డే నాడు భాగమతిగా అనుష్క ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేయనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: