ప్రస్తుతం టాలీవుడ్ లో సంచలనంగా మారిన నంది అవార్డుల గొడవ రచ్చ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. 2014, 15, 16 సంవత్సరాలకు గాను ప్రకటించిన నంది అవార్డులను నిరసిస్తూ కొందరు సిని ప్రముఖులు తమ అసంతృప్తిని వెళ్లడించారు. ఒక్కొక్కరు తమ అభిప్రాయం వెళ్లబుచ్చడంతో దీనిపై పెద్ద చర్చే నడుస్తుంది. పక్కాగా చెప్పాలంటే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో లోపల ఉన్న కుల కుమ్ములాటలు బయట పడ్డాయని చెప్పొచ్చు.


అయితే ఈ అవార్డుల్లో ముఖ్యంగా మెగా నందమూరి ఫ్యామిలీల మధ్య చిచ్చు పెడుతున్నాయి. మెగా ఫ్యామిలీ అభిమానులు ఈ అవార్డులను తప్పు పడుతున్నారు. దానికి కొంతమంది సిని ప్రముఖుల సపోర్ట్ కూడా దొరికింది. నంది అవార్డుల ఎంపిక విధానంలో జ్యూరీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు కూడా కొంత దుమారాన్ని రేపాయి.


ఇక హాట్ టాపిక్ అయిన ఈ విషయంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలుగ చేసుకుని అందరిని శాంతింపచేస్తాడని అంటున్నారు. ఒక్కొక్కరిగా తమ అసంతృప్తి తెలియచేస్తున్న ఈ అవార్డుల చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేలా పవన్ క్లైమాక్స్ పంచ్ వేస్తాడని అంటున్నారు. అయితే పవన్ చెప్పే కామెంట్ ఎలా ఉండబోతుంది అన్న ఎక్సయిటింగ్ మొదలైంది.


అజ్ఞాతవాసి చివరి షెడ్యూల్ కోసం ఫారిన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ నంది అవార్డుల గొడవపై ఎలా స్పందిస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి నంది అవార్డులు లోపల ఉన్న కుల కుతంత్రాలను బయటపడేలా చేసింది. పైకి మేమంతా ఒక్కటే అంటూ చెప్పుకుంటున్నా అధికార దుర్వినియోగం చేస్తున్నారని కొందరు అంటున్నారు. మరి ఈ నందుల గొడవకు ఎలాంటి ముగింపు లభిస్తుందో చూడాలి.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: