సినిమా సెలబ్రెటీలు స్పోర్ట్స్ స్టార్లు వ్యాపారాలు చేసుకునే కల్చర్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. దీనితో చాలమంది ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే  మరోవైపు వివిధరకాల బిజినెస్ లు చేస్తూ చాలబిజీగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఈతరం స్టార్స్  చాలమంది ఎక్కువగా ఫుడ్ అండ్ డ్రింక్స్ కు సంబంధించన బిజినెస్ లు చేస్తూ రెండుచేతులా గణిస్తున్నారు. 

స్టైలిష్ స్టార్ గా లక్షలాది అభిమానుల చేత పిలిపించుకునే అల్లుఅర్జున్ ఇప్పడు వ్యాపారాల్లో కూడ ఫుల్ స్పీడ్ చూపిస్తు తోటి యంగ్ హీరోలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ నేపధ్యంలో నిన్న నవంబర్ 17 సాయంత్రం 8 గంటలకు బీ-డబ్స్ అంటూ కొత్త బిజినెస్ వెంచర్ ను స్టార్ట్ చేసాడు బన్ని తెలుస్తున్న సమాచారం మేరకు ఇదో స్పోర్ట్స్ బార్. 

యూఎస్ ఏకు చెందిన బఫెలో వైల్డ్ వింగ్స్ ను ఇండియాలో బీ-డబ్స్ పేరుతో స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హైద్రాబాద్ లోని జూబిలీ హిల్స్ లో ఈ స్పోర్ట్స్ బార్  మొదలు అయింది. దీనిలో అల్లు అర్జున్ కు పార్ట్నర్ షిప్ ఉందని ఇన్వెస్టర్ కూడా అంటూ ఏకంగా పోస్టర్స్ నే ప్రింట్ చేయడం బన్నీ అభిమానులను ఆకర్షించే మరో ఎత్తుగడ అని అంటున్నారు. అల్లు అర్జున్ కు వ్యాపారాలు కొత్తకాదు ఇప్పటికే 800 జూబిలీ అంటూ ఓ పబ్ ఉంది. కొన్ని రోజుల క్రితమే ఇదే ప్రెమిసెస్ లో కానోలీ కేఫ్ అంటూ ఓ స్విస్ బేకరీని కూడా స్టార్ట్ చేశాడు బన్నీ. 

ఇలా ఒక వైపు సినిమాలు చేస్తూ మరోవైపు కొత్తకొత్త వ్యాపారాలు చేస్తూ బన్ని తన కెరియర్ ను పరగులు తీయిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా అల్లుఅర్జున్నటించిన హిందీలో డబ్ అయిన సినిమాలకు సంబంధించి ఏసినిమా ఇప్పటి వరకు అందుకొని వ్యూస్  బన్నీ సినిమా అందుకుంది. 100 మిలియన్స్ వ్యూస్ మార్క్ ని ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్ మూవీ అందుకుంది. ఈసినిమాలోని  ఊరమాస్ యాక్షన్ సీన్స్ నార్త్ ప్రజలకు బాగా నచ్చేయడంతో  ఈసినిమాను యూట్యూబ్ లో తెగ చూస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: