ప్రతీ చిన్న సినిమా ఈ రోజుల్లో కాంట్రవర్సీ లో పడుతోంది. ఒకవేళ ఆ చిత్రం పడకపోయినా ఏదైనా కాంట్రవర్సీ అయ్యేలా నిర్మాతలో ఏదో ఒకటి అంటిస్తూ ఉన్న పరిస్థితి వచ్చేసింది. దేనికైనా రెడీ సినిమా దగ్గర నుంచీ అర్జున్ రెడ్డి వరకూ తెలుగులో ఇలాంటి వివాదాల చిత్రాలకి కొదవ ఎక్కడా రాలేదు.

యావరేజ్ సినిమాలు కూడా ఈ కాంట్రవర్సీ ల పుణ్యమా అని బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. ఈ డిసెంబర్ 1 న రాబోతున్న పద్మావతి సినిమాకి సంబంధించి పలు హిందూ సంస్థలు గొడవ చేస్తున్నాయి.

తమ రాజ్యాన్ని లొంగతీసుకోవాలని, మహారాణి పద్మావతిని వశం చేసుకోవాలని ముస్లిం రాజు అయిన ఖిల్జీ వస్తే ఆయనకు లొంగకుండా పద్మావతితో పాటు 16వేల మంది ఆ రాజ్యం మహిళలు ఆత్మాహుతి చేసుకున్నారని, కానీ ఈ చిత్రంలో రాణి పద్మావతికి ఖిల్జీకి మధ్య ప్రేమాయణం జరిగినట్టుగా చూపిస్తున్నారని ఉద్యమకారుల ఆందోళన.

ఇక ఈ చిత్రంలో నిజంగా ఖిల్జీ, పద్మావతిల మధ్య ప్రేమాయణాన్ని చూపించారని, అయితే దానిని ఖిల్జీ తన ప్రేయసిగా పద్మావతిని ఊహించుకునే సీన్స్‌  అని అంటున్నారు. ఆ కర్జి సేన లాంటి వారికి ఈ చిత్రం చూపించి అసలైన నిజాలు ఏంటో సంజయ్ లీలా భన్సాలి చూపించవచ్చు కదా? అంటే ఏదో తప్పు చేస్తున్నారు కాబట్టే ఇలా వారిని అవాయిడ్ చేస్తూ కాంట్రవర్సీ ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్న మాట? ఇలాంటి పనులు చేసి చీప్ డైరెక్టర్ ల లాగా వివాదాల కోసం వెయిట్ చేస్తూ ఆయన డిగ్నిటీ ఆయనే పోగొట్టుకున్నట్టు అవుతోంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: