రేణు దేశాయ్ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు రెండవ పెళ్లి చేసుకునే ఆలోచనలు వస్తున్నాయి అన్న విషయాలు బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈసంఘటన జరిగి కొద్దిరోజులు కూడ గడవకుండానే రేణు దేశాయ్ మొబైల్ ఫోనులో పవన్ ఫోటో కనిపించిన  సంఘటన చాలమంది కంటపడటంతో ఆవిషయం హాట్ టాపిక్ గా మారింది. ఆశక్తి కలిగించే ఈసంఘటన వివరాలలోకి వెళ్లితే చేయి చేయి కలిపి చేయూతనిద్దాం అనే కాన్సెప్ట్ తో ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ. 

పలువురు చిన్నారులను చేరదీసి వారికి అండగా  నిలబడటమే కాకుండా వారికి చదువులు చెప్పించి ఉన్నత విద్యావంతులుగా మార్చేందుకు ఈసంస్థ నిర్వాహకులు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దీనితో పాటు ఆ సంస్థ సేవలు  అందిస్తున్న చిన్నారులలో ఉత్సాహం నింపేందుకు పలువురు సెలబ్రిటీలను కూడా ఆహ్వానించి వారితో ఆ పిల్లలు స్పూర్తి పొందేలా కార్యక్రమాలు  నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య రేణు దేశాయ్ ఈసంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక భవనానికి వెళ్ళింది అక్కడి నుంచి ఆమె నేరుగా సోషల్ మీడియాలోని జనాలకు లైవ్ గా కనెక్ట్ కావడమే కాకుండా అక్కడ ఉన్న చిన్నారులను అందరినీ  పేరు పేరునా పరిచయంచేసి వారితో సందడి చేసింది. 

అంతేకాదు అక్కడ ఉన్న చినారులతో టీవీ తక్కువగా చూడాలని సినిమాలు తక్కువగా చూడాలని ఎక్కువగా చదువుకోవాలని చెప్పడమే కాకుండా వారి దగ్గర నుంచి మాట కూడా తీసుకుంది. ఇదే సందర్భంలో  అక్కడ ఉన్న ప్రతీ ఒక చిన్నారి కవర్ అయ్యేలా తన ఫోన్ నుంచి వీడియో లైవ్ ను టెలికాస్ట్ చేసింది రేణూ దేశాయ్. అయితే ఈకార్యక్రమం  సోషల్ మీడియాలో లైవ్ టెలికాస్ట్ కావడంతో ఈకార్యక్రమాన్ని చూడటమే కాకుండా అనేకమంది తమ కామెంట్స్ తో రేను దేశాయ్ ని ప్రశంసించారు. 

అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఫోటో రేణు దేశాయ్ ఫోన్ లో  కనిపించగానే అక్కడి చిన్నారులు అంతా తెగ సందడి చేసేశారు. నిజంగానే పవన్ ఆ కార్యక్రమాన్ని చూసి కామెంట్ చేశాడని ఆచిన్నారులు భావించారు. అయితే చాలామంది తమకు బాగా నచ్చిన  వారి ఫోటోలను ఇలా ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకుంటారని రేణు చెప్పి ఆచిన్నారులను సముదాయించినట్లు టాక్. అయితే ఒకవైపు రెండవ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాను అంటూ రేణు దేశాయ్ ఇలా పవన్ ఫోటోను తన ఫోన్ ప్రొఫైల్ గా పెట్టుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటో ఆమెకే తెలియాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: