టాలీవుడ్ సూపర్ స్టార్ గా లక్షలాది మంది అభిమానులను పొందిన మహేష్ బాబు అనేక మల్టీ బ్రాండ్ వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేస్తూ తన సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా కోట్లు గణిస్తున్న విషయం తెలిసిందే. అయితే అటువంటి మహేష్ ఆమధ్య ఒక లిక్కర్ బేస్డ్ కంపెనీ ప్రకటనలో నటిస్తే జరిగిన
రచ్చ అంతాఇంతా కాదు. దీనితో అటువంటి యాడ్స్ ను చేయడం మానేసాడు మహేష్.

మహేష్ ఎంత అందంగా ఉంటాడో అతడి ప్రవర్తన కూడ అంత చక్కగా ఉంటుందని చెపుతారు. ప్రైవేట్ లైఫ్ లో సిగరెట్ తో మందు గ్లాస్ తో మహేష్ పార్టీలలో హడావిడి చేసిన ఫోటోలు ఎక్కడ ఉండవు. అతడు నటించే సినిమాలలో కూడ మహేష్ మందుకొడుతున్నట్లు తీసే సీన్స్ సామాన్యంగా కనిపించవు.

కానీ లేటెస్ట్ గా మహేష్ బాబు ఒక క్యాసినో లో గ్యాంబ్లింగ్ ఆడుతున్నట్లుగా ఉన్న ఫోటో ప్రస్తుతం మీడియాలో హడావిడి చేస్తోంది. దీనికితోడు మహేష్ ఎదురుగా ఒక మందు గ్లాస్ కూడ కనిపిస్తోంది. మహేష్ పక్కన మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన ప్రొడ్యూసర్ కూడా ఈఫోటోలో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం మన సూపర్ స్టార్ అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. 

అయితే ఒక కూల్ డ్రింక్ యాడ్ కోసం అమెరికాకు వెళ్ళిన మహేష్ తన పద్దతికి విరుద్ధంగా అమెరికాలోని ఒక క్యాసినోకు వెళ్లడమే కాకుండా అతడి ముందు మందుగ్లాస్ తో హడావిడి చేస్తున్న ఈఫోటోను కొందరు క్లిక్ మానిపించి మీడియాలో షేర్ చేసారు. ప్రస్తుతం ఈఫోటో వైరల్ గా మారడంతో ప్రిన్స్ మహేష్ బాబు కూడ మారిపోయాడా ? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: