టాలీవుడ్ టాప్ యంగ్ హీరోల రేస్ లో దూసుకుపోతున్న రామ్ చరణ్ తన చిన్ననాటి విషయాలను పవన్ కళ్యాణ్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని షేర్ చేస్తూ ఒక ప్రముఖ పత్రికకు ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు. ప్రస్తుతం భారీ సినిమాలకు చిరునామాగా మారిన చరణ్ కు చిన్నప్పుడు మోటారు బైక్ ఎక్కాలి అంటే మహా భయం అట. 

అంతేకాదు తాను చిన్నప్పుడు ఎప్పుడు సినిమా పత్రికలు కానీ సినిమా బొమ్మలు కానీ చూడటం ఇష్టం లేదని చెపుతూ తాను చాల సంవత్సరాలు సినిమా బొమ్మలు చూడకుండా పెరిగిన నేపధ్యాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఇదే సందర్భంలో తన బాబాయ్ గురించి మాట్లాడుతూ తన తల్లి దగ్గర పవన్ పెద్ద కొడుకులా ఉంటాడని ఆమధ్య తన తల్లికి మోకాలికి ఆపరేషన్ జరిగితే పవన్ తమ ఇంటికి వచ్చి తన తల్లితో కన్నా కొడుకులా గంటల సేపు ఉన్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.

అంతేకాదు ఈమధ్య తన బాబాయ్ కి పుట్టిన రెండవ కొడుకును ఇంటికి తీసుకు వచ్చి తన తల్లికి చూపించడమే కాకుండా తన కొడుకుకు పెట్టబోతున్న పేరును కూడ ముందుగానే తన తల్లికి చెప్పిన విషయాన్ని బయట పెట్టాడు చరణ్. అయితే తన బాబాయ్ పవన్ రాజకీయాలలో ఉన్నా తాను ఎప్పుడైనా రాజకీయాల గురించి మాట్లాడితే పవన్ కు నచ్చదని అంటూ ‘ప్రజారాజ్యం’ ఎన్నికల ప్రచార సమయంలో తాను రైలుయాత్రకు వెళ్ళినప్పుడు ‘నువ్వు అప్పుడే బయటకు ఎందుకు వచ్చావు’ అంటూ తనను చనువుతో మందలించిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

ఇదే సందర్భంలో తన కుటుంబంలో పెరిగిపోయిన మెగా కుటుంబ హీరోల సంఖ్య గురించి మాట్లాడుతూ తన కుటుంబంలో హీరోలు ఎక్కువ అయిపోవడంతో తాను నటించే సినిమాలకు రిలీజ్ డేట్ దొరకడం కష్టంగా ఉంది అంటూ జోక్ చేసాడు చరణ్. అయితే తనకు జీవితంలో పెద్దపెద్ద లక్ష్యాలు లేవని ఇంత సంఖ్యలో సినిమాలు చేసి ఇంత మార్కెట్ సంపాదించాలని తనకు కోరికలు లేవు అని అంటూ వీలైనంత వరకు మంచి సినిమాలు చేసి మెగా అభిమానుల గుండెలలో శాస్వితంగా ఉండిపోవాలని అన్నదే తన కోరిక అని అంటున్నాడు చరణ్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: