ప్రపంచం అంతా ఓపెన్ మార్కెట్ గా మారిపోవడంతో విదేశీ సంస్థలు మన దేశంలో వాటి బ్రాంచ్ లు పెట్టటం ఇక్కడ తమ వ్యాపారాన్ని విస్తరించటం నేటి బిజినెస్ ట్రెండ్. అయితే ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన కేంద్రప్రభుత్వం కొత్త విధానాలతో మనదేశం నుంచి అనేక మంది ప్రముఖులు ఇతరదేశాలకు వెళ్ళి ఇక్కడి వ్యాపార అవకాశాలపై విదేశాలలో బోలెడంత ప్రచారం చేస్తున్నారు. 

ఈ జాబితాలోకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయాడు. పలు ప్రజాసమస్యల పై పవన్ స్పందిస్తున్న తీరుకు పవన్  కి ఇండో యూరోపియన్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చిన విషయం  తెలిసిందే. పవన్‌ కళ్యాణ్ కు  బ్రిటన్ పార్లమెంట్ హౌస్‌ ఆఫ్ లార్డ్స్‌లో ఈ అరుదైన గౌరవం దక్కింది. ‘జనసేన’ అధినేతగా ప్రజా సమస్యల పై పోరాడినందుకుగాను పవన్ కు ఈ అవార్డు ఇచ్చారు. 

రీసెంట్ గా జరిగిన ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ సదస్సుకు పవన్ ఒక పొలిటీషియన్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంలో అక్కడి ప్రతినిధులు ఇండియాలో ఉన్న అవకాశాలపై తన వ్యూ చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ ను కోరగా తాను ఇక్కడకు రాజకీయ నేపథ్యాల గురించి ఇతర అంశాల గురించి మాట్లాడేందుకు రాలేదంటూ నిక్కచ్చిగా చెప్పేసిన పవన్ ‘ఇండియా అంటే అక్కడి ప్రభుత్వం కాదు ఇండియా అంటే అక్కడి ప్రజలు. వారి దగ్గర ఉన్న నైపుణ్యం' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

ప్రస్తుతం పవన్ ఇండియా పై చేసిన స్లోగన్ పవన్ అభిమానులకు మాత్రమే కాకుండా సామాన్యులకు సైతం ఆలోచించేలా ఉందని అభిప్రాయపడుతున్నారు. 130 కోట్ల భారతీయుల ఆశలకు ప్రతిరూపం ఇండియా అని అర్ధం వచ్చేలా పవన్ చేసిన కామెంట్స్ అతడి బాధ్యతాయుతమైన ఉన్నత భావాలను సూచిస్తున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి



మరింత సమాచారం తెలుసుకోండి: