గడిచిన వారాంతం లో బాక్స్ ఆఫీస్ కళకళ లాడిపోయింది , ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 సినిమాల వరకూ విడుదల అయ్యాయి.అందులో ఖాకి, గృహం, స్నేహ‌మేరా జీవితం, లండ‌న్ బాబులు, ప్రేమ‌తో మీ కార్తీక్‌… ఇలాంటి సినిమాలున్నాయి.


రావ‌డానికి ప‌ది సినిమాలొచ్చినా, బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిల‌దొక్కుకొనే ల‌క్ష‌ణం ఒక్క‌దాంట్లోనూ క‌నిపించక‌పోవ‌డం శోచ‌నీయం. ఉన్న వాటిల్లో కార్తి హీరోగా వచ్చిన ఖాకీ చిత్రమే కాస్త పాజిటివ్ గా వెళుతోంది. మాస్ ని ఆకట్టుకునే చిత్రం తప్ప క్లాస్ చిత్రం కాదు ఇది. ఇక గృహం సినిమాకి మంచి టాక్ వచ్చినా హర్రర్ చిత్రాలు నచ్చేవారికి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది అని చెప్పాలి. అయితే సిద్దార్థ్‌ని న‌మ్మి సినిమాకు వెళ్లేవాళ్లు ఎంత‌మంది అనేది ఒక‌ట్రెండు రోజుల్లో తేలిపోతుంది.


త‌మిళంలోలా తెలుగులో ఈ సినిమా హిట్ అయి, భారీ వ‌సూళ్లు వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌.హిట్ అయిన తమిళ చిత్రాన్ని రీమేక్ చేసిన లండన్ బాబులు చిత్రం కి ప్రచారం బాగున్నా వసూళ్లు సరిగ్గా లేవు. ఈ సినిమా బయ్యర్ల కి నష్టాలు మిగిల్చే లాగా కనిపిస్తోంది. స్నేహమేర జీవితం , కార్తిక్ ఇలాంటి సినిమాలని పట్టించుకునే వారు లేనే లేరు.



మొత్తం మీద ఇన్ని సినిమాల్లో ఒక్కటీ సూపర్ హిట్ గా నిలవలేదు. వ‌చ్చేవారం `బాల‌కృష్ణుడు` వ‌స్తోంది. 24న కూడా పెద్ద సంఖ్య‌లో సినిమాలొస్తున్నా.. రోహిత్ సినిమానే కాస్త ఎట్రాక్ట్ చేస్తోంది. `నెపోలియ‌న్‌` కూడా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న క‌థే. ఇవి రెండూ ఏమైనా అల‌రిస్తాయేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: