"బంగరు నంది అవార్డుల పంపకం" విషయంలో జరుగుతున్న రచ్చపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ దిన పత్రిక ఆంద్రజ్యోతి  ద్వారా పరోక్షంగా స్పందించింది.ఆ పత్రిక కధనం ప్రకారం బంగరు నంది అవార్డులపై విమర్శల పర్వం ఇలాగే కొనసాగితే అసలు అసలు నంది అవార్డులు బహూకరణను నిలిపివేస్తామని ఏపి ప్రభుత్వం హెచ్చరించింది. తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో సినీ పరిశ్రమ ఉన్నా, తాము అవార్డులు ఇచ్చామన్న సంగతి గుర్తుంచు కోవాలని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లు ఆ పత్రికా కదనం తెలిపింది.ఈ కధనంలో ఒక భాగం ఇలా ఉంది.
bangaru nandi awards కోసం చిత్ర ఫలితం

"నంది అవార్డులను ప్రకటించడంతోపాటు తెలుగువారు గర్వపడేలా విజయవాడలోని "కృష్ణా నది పవిత్ర సంగమం" పరిసరాల్లో శోభాయమానంగా బంగరు నంది అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం భావించిందని, తాజా పరిణామాలతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. "మూడేళ్ల నంది అవార్డులను ప్రకటించాం. అవార్డుల బహూకరణ కూడా మొక్కుబడిగా కాకుండా భారీగా చేయాలని నిర్ణయించాం. ఏవేవో కారణాలతో నంది అవార్డుల అంశాన్ని విమర్శల పాలు చేయడం, ప్రభుత్వాన్ని నిందించడం సరైన పద్ధతి కాదు - అని సమాచార, పౌర సంబంధాల శాఖలోని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు." అని పత్రిక తన కదనం ద్వారా తెలిపింది. ఆ కథనం సంక్షిప్తంగా ఇలా సాగింది. 

bangaru nandi awaards  కోసం చిత్ర ఫలితం

‘‘రాష్ట్ర విభజన జరిగి నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేళ్లుగా నంది అవార్డుల అంశంపై ప్రభుత్వం దృష్టి సారించ లేదు. తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడున్నా ప్రాంతా ల కతీతంగా తెలుగు కళాకారులను గౌరవించి, ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మూడేళ్ల నంది అవార్డులను ఒకేసారి ప్రకటించాలని నిర్ణయించింది. ఆ మేరకు కమిటీలను నియమించింది. దీన్ని కూడా వివాదాస్పదం చేయడం దారుణం’’  అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వవర్గాలు మండిపడుతున్నాయి. నంది అవార్డులపై జరుగుతున్న రాద్ధాంతంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారం శ్రుతి మించితే అసలు నంది అవార్డులనే పూర్తిగా రద్దు చేయాలనే యోచన చేస్తున్నాయి.

bangaru nandi awaards  కోసం చిత్ర ఫలితం

కొన్ని దశాబ్దాలుగా నంది అవార్డులను ఇస్తున్నారని, ఏటా అవార్డులు ఇచ్చినప్పుడల్లా కొంత రచ్చజరగడం ఆనవాయితీగా ఉంటోందని, ఈసారి అది శ్రుతిమించి ప్రభుత్వా న్ని అప్రతిష్ఠపాలు చేసేలా ఉందని భావిస్తున్నాయి. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడమే లక్ష్యంగా కొందరు నంది అవార్డుల అంశానికి సంబంధంలేని అంశాలనూ జోడించి విమర్శలు చేస్తున్నారని తప్పుబడుతున్నాయి.

bangaru nandi awaards  కోసం చిత్ర ఫలితం

‘‘వాస్తవానికి సినీ అవార్డులను ఏ రాష్ట్రంలో ఉండేవారికి ఆ రాష్ట్రం ఇస్తుంది. అయితే, ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ చాలా వరకు హైదరాబాద్‌లోనే ఉంటోంది. హీరోల నుంచి చిన్న నటుల వరకూ అంతా అక్కడే. వారి ఆస్తులూ అక్కడే. సినీ పరి శ్రమకు చెందిన వారిలో కొందరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంస్థలు ఉన్నా, వాటి ప్రధాన కార్యాలయాలు, పన్ను చెల్లింపులు అన్నీ తెలంగాణలోనే జరుగుతున్నాయి. అయినా, తెలుగు వారంతా ఒక్కటే అన్న ఉద్దేశంతో మొత్తం తెలుగువారిని అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నా, అనవసర రాద్ధాంతంతో రచ్చ చేయడం ఎంత వరకు సబబు?’’ అని ప్రశ్నిస్తున్నాయి.

bangaru nandi awaards  కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: