సెంటిమెంట్స్ కు అదేవిధంగా దేవుళ్ళకు చాలదూరంగా ఉండే రాంగోపాల్ వర్మనాగార్జునతో తాను లేటెస్ట్ గా తీస్తున్న సినిమాకు సంబంధించి అనుసరిస్తున్న సెంటిమెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు సినిమా మేకింగ్ చరిత్రను రెండు భాగాలుగా చేస్తే రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘శివ’ కు ముందు ‘శివ’ తర్వాత అన్న విభజనను  సినీ విశ్లేషకులు చేస్తూ ఉంటారు.

తెలుగు సినిమా మేకింగ్ లో ఎన్నో మార్పులను ‘శివ’ మూవీ తీసుకు వచ్చింది. సుమారు28 సంవత్సరాల క్రితంవచ్చిన ఈ మూవి నాగార్జున కెరియర్ గ్రాఫ్ ను పూర్తిగా మార్చి వేసింది. అప్పట్లో ఈ సినిమాలోని నాగార్జున బాడీ లాంగ్వేజ్ అప్పటి యూత్ కు ఒక ఐకాన్ గా మారింది. 

తెలుగు సినిమాకు సాంకేతికంగా సరికొత్త ప్రమాణాల్ని నెలకొల్పిన ఈసినిమా టెక్నిక్ ను అనుసరిస్తూ మన తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం వర్మ పరాజయాల బాటలో పయనిస్తూ ఉన్నా నాగ్ ఆవిషయాలను లెక్క చేయకుండా తిరిగి వర్మతో సినిమా చేయడమే కాకుండా 28 ఏళ్ల క్రితం శివ మూవీని ఎలా స్టార్ట్ చేశారో అచ్చు గుద్దినట్లు అదేవిధంగా ఈరోజు వర్మ నాగ్ పై తొలి షాట్ ను తీయబోతున్నాడు.

‘శివ’ సినిమా ముహుర్తం షాట్ ను అన్నపూర్ణ స్టూడియో దగ్గర గ్లాస్ హౌస్ దగ్గర ఎలా తీసారో అదేవిధంగా ఈరోజు ఈ లేటెస్ట్ మూవీకి సంబంధించి తొలి షాట్ ను అదేవిధంగా తీయబోతున్నారు. ‘శివ’ సినిమాకు వర్మ తండ్రి క్లాప్ కొడితే ప్రస్తుతం వర్మ నాగ్ ల లేటెస్ట్ మూవీకి వర్మ తల్లి క్లాప్ కొత్తబోతోంది. దీనితో సెంటిమెంట్స్ కు దూరంగా ఉండే వర్మ కూడ మారిన పరిస్థుతుల రీత్యా సెంటిమెంట్స్ ను నమ్ముతున్నాడు అనుకోవాలి. చాల కాలం తరువాత నాగార్జున ఒక విలక్షణమైన పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న ఈసినిమాకు వర్మ తన సహజసిద్ధమైన తిక్క ప్రదర్శించకుండా నేటి తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీయగలిగితే తిరిగి వర్మ దర్శకుడుగా ట్రాక్ లోకి రావడం ఖాయం..   


మరింత సమాచారం తెలుసుకోండి: