ఈరోజు అన్నపూర్ణ స్టుడియోలో అక్కినేని నాగార్జున రామ్ గోపాల్ వర్మల కాంబినేషన్ లో మొదలైన కొత్తసినిమా ప్రారంభసమయంలో వ్యూహాత్మకంగా నాగార్జున వర్మను కార్నర్ చేస్తూ చేసిన కామెంట్స్ ఆసినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన చాలామందికి షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈకామెంట్స్ తో నాగ్ వర్మను పోగిడినట్లా లేదా వ్యూహాత్మకంగా హెచ్చరిస్తున్నట్లా అన్నవిషయం పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 'నాకు మైండ్ దొబ్బలేదు. నామైండ్ బాగానే ఉంది. నేను ఈసినిమా కథ విన్నప్పటి నుండి షూటింగ్ కు వెళ్ళాలి సినిమాను తియ్యాలి అనే ఎక్సయిట్మెంట్ తో ఉన్నాను. పనిచేయాలంటే రోజూ ఇలా ఎక్సయిట్మెంట్ ఉంటే భలే ఉంటుంది. ‘శివ’ సినిమా తీసినప్పుడు హిట్ అవుతుంది  అనుకోలేదు. ఇప్పుడు కూడా మేం అనుకోవట్లేదు. ఒకరిమీద ఒకరం నమ్మకంతో సినిమా చేస్తున్నాం' అంటూ విలక్షణ కామెంట్స్ చేసాడు నాగార్జున. ఈరోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈసినిమా ప్రారంభంలో నాగార్జున మరో ఆసక్తికర కామెంట్ చేసాడు. 

''నాన్నగారు అప్పట్లో ఓ మాటన్నారు. 28ఏళ్ళకు ఒకనటునికి పరిపూర్ణత వస్తుంది అన్నారు. అలా 28ఏళ్ళ వయస్సులో ‘శివ’ చేశాను. ఇప్పుడు మళ్ళీ 28ఏళ్ల తరువాత డబుల్ మెట్యూరిటీ వస్తోందని నమ్ముతున్నాను. అందుకే మళ్ళీ వర్మతో సినిమా చేస్తున్నాను'' అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఈసినిమా కథ గురించి చెపుతూ వర్మ తనకు చెప్పిన ఈకథలో కాన్ఫ్లిక్ట్  చాల అద్భుతంగా ఉంటుందని ఆకథకు సంబంధించిన కొన్ని సీన్స్ వర్మ చెపుతుంటే తన మైండ్ బ్లాంక్ అయిన విషయాన్ని బయటపెట్టాడు నాగార్జున. 

అంతేకాదు ఈసినిమాతో వర్మ మరోసారి టెక్నికల్ స్టాండర్స్డ్ ను కొత్త స్థాయికి తీసుకువెళ్తాడని చెపుతూ ‘శివ’ తో ఎలాగైతే దేశవ్యాప్తంగా ఒక కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశామో ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాం అన్న సంకేతాలు ఇచ్చాడు నాగార్జున. అయితే ఇక్కడ మరో ఊహించని ట్విస్ట్ ఇస్తూ నాగార్జున ఈసినిమాతో తన కెరియర్ కు పెద్దగా చేకూరే లాభనష్టాలు ఉన్నా లేకపోయినా రామ్ గోపాల్ వర్మకు మాత్రం ఈసినిమా విజయం కీలకం అంటూ ఈసినిమాకు తేడా జరిగితే ఇక స్టార్ హీరోలు ఆయనను దూరం పెట్టె ప్రమాదం ఉంది అంటూ సున్నితంగా హెచ్చరించాడు నాగ్. అయితే సినిమా ప్రారంభోత్సవం రోజున ఈసినిమా ఫలితం పై నాగార్జునకు ఎందుకుఇంత నైరాశ్యం అంటూ ఆప్రారంభోత్సవానికి వచ్చిన చాలామంది తమలో తాము కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: