రెండురోజుల క్రితం రాజమౌళి ఎటువంటి విషయాలు వెళ్ళడించకుండా జూనియర్ చరణ్ తో కూడిన ఒక ఫోటోను తన ట్విటర్ లో షేర్ చేయడంతో రాజమౌళి నోటివెంట వీరి ఇద్దరి కాంబినేషన్ కు సంబంధించిన మల్టీ స్టారర్ విషయాలు చెప్పకపోయినా అత్యంత భారీ స్థాయిలో చరణ్ జూనియర్ ల మల్టీ స్టారర్ పై ఊహాగానాలు ఊపు అందుకున్నాయి. ఈ ఊహాగానాలకు రాజమౌళి ఖండన ఇవ్వకపోవడంతో ప్రస్తుతం రాజమౌళి తీయబోయే కొత్త సినిమాలో చరణ్ జూనియర్ లు హీరోలు అన్న విషయం అన్యాపదేశంగా ఖరార్ అయింది.

ఈవార్త బయటకు రావడంతో తిరిగి ‘మగధీర’ కాంబినేషన్ రిపీట్ అవుతోంది అంటూ మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈవిషయం చరణ్ కు కూడ ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నా ఒక విషయంలో చరణ్ ను అయోమయంలో పడేస్తోంది అని ఫిలింనగర్ టాక్. చరణ్ ప్రస్తుతం నటిస్తున్న రంగస్థలం తరువాత బోయపాటి దర్శకత్వంలో ఒక భారీ మాస్ సినిమాను చేయడానికి కమిట్ అయ్యాడు.

ఈమూవీ ప్రాజెక్ట్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయ్యే దిశగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఊహించని జాక్ పాట్ గా రాజమౌళి మల్టీ స్టారర్ తన చేతికి రావడంతో బోయపాటి సినిమాను వొదులుకోవాలా లేదంటే ఈరెండు సినిమాలను సమాంతరంగా నడిపించడానికి రాజమౌళి అంగీకరిస్తాడా లేదా అన్న సందేహాలు చరణ్ ప్రస్తుతం వెంటాడుతున్నట్లు టాక్. 

దీనికితోడు రాజమౌళి సినిమాలకు సంబంధించి లుక్ విషయంలో ప్రత్యేకమైన మేకోవర్ ఉంటుంది కాబట్టి బోయపాటి సినిమా హీరో లుక్ తో పాటు రాజమౌళి సినిమా హీరో లుక్ ఒకేసారి సమాంతరంగా మెయిన్ టైన్ చేయడం కష్టం అన్న సందేహాలు చరణ్ ను వెంటాడుతున్నట్లు టాక్. దీనికితోడు జక్కన్న తాను తీసే సినిమాలను చాల నెమ్మదిగా తీస్తాడు అన్న పేరున్న నేపధ్యంలో ఒకసారి రాజమౌళి ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోయిన తరువాత మరో సినిమా గురించి ఆలోచించలేరు కాబట్టి చరణ్ బోయపాటికి ఏమి సమాధానం చెప్పాలి అన్న విషయమై తెగమధన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏమైనా రాజమౌళి రెండవసారి ఇచ్చిన అవకాసం చరణ్ కు ఆనందంతో పాటు టెన్షన్ కూడ పెడుతోంది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: