వరస పరాజయాలతో సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ కు వచ్చేవారం విడుదల కాబోతున్న జవాన్ మూవీ ఫలితం అత్యంత కీలకంగా మారింది. ‘వాంటెడ్’ లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బి.వి.ఎస్.రవి మళ్లీ దర్శకుడిగా మారి 6 సంవత్సరాల గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా ‘జవాన్’ ప్రస్తుతం ఈమూవీ పై పెద్ద గా పాజిటివ్ టాక్ లేదు. 

అయితే నిర్మాత దిల్ రాజు హ్యాండ్ ఈమూవీ పై పడటంతో పాటు మూడు నెలల కిందటే విడుదల కావాల్సిన ఈ సినిమాను ఆపించి మార్పులుచేర్పులు దిల్ రాజ్ చేయించడంతో ఈసినిమా పై నెమ్మదిగా అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమాకు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల ‘శివ’ కూడ తనవంతు సాయంచేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 

బి.వి.ఎస్.రవికి కొరటాల శివకు కాలేజీ రోజుల నుంచి పరిచియం ఉందట. వీరుఇద్దరూ కలిసి చదువుకున్నారట ఇండస్ట్రీలోకి కూడా కలిసి వచ్చారట. చాలా కాలం కలిసి ఉన్నారట. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ విని కొరటాల శివ మార్పులు చేర్పులు చెప్పడమే కాకుండా సినిమాతీశాక కూడ అది చూసి కొరటాల కొన్ని కరెక్షన్స్ చెప్పాడని టాక్. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలోనూ కొరటాల హ్యాండ్ ఉన్నట్లుగా దిల్ రాజ్ చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విషయంలో తన మిత్రుడికి హిట్టు రావాలని కొరటాల ఎంతో తపించాడని తనవంతుగా ఈసినిమాకు సహకారం అందించాడడని దిల్ రాజ్ తన సన్నిహితులతో చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు హరీష్ శంకర్ సైతం ఈచిత్రానికి క్రియేటివ్ ఇన్ పుట్స్ ఇచ్చాడని అంటున్నారు. దీనితో ఇంతమంది ప్రముఖ దర్శకుల సలహాలతో రూపొందిన ‘జవాన్’ ఫలితం ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అందరిలోను ఉంది. ఈ సినిమా హిట్ కాకపోతే సాయి ధరమ్ తేజుకు ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టం అవుతుంది అని వినిపిస్తున్న కామెంట్స్ మెగా మేనల్లుడుకి విపరీతమైన టెన్షన్ క్రియేట్ చేస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: