గతేడాది వచ్చిన బిచ్చగాడు సినిమా మనలో చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది. కోటీశ్వరుడు అయిన తల్లి ఆరోగ్యం కోసం బిచ్చగాడు గా మారే హీరో నలభై రోజుల పాటు ముష్టి ఎత్తుకుంటూ బతుకుతాడు. తల్లి ఆరోగ్యం బాగుంటే చాలు అనే ఫీలింగ్ తో ఒక కోటీశ్వరుడు అలా మారడం అందరిని కలచి వేస్తుంది. ఈ సినిమా తమిళ అనువాదం అయినా తెలుగు లో బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇక్కడ విజయ్ ఆంతోనీ కి సూపర్ మార్కెట్ ని ఇచ్చింది.

అచ్చం ఇలాగే నిజ జీవితాల్లో కూడా జరగడం మనం ఈ మధ్యన చూస్తూనే ఉన్నాం. తాజాగా హైదరాబాద్ లో బిచ్చగాళ్ళని ఏరి వేసే ప్రోగ్రాం పెట్టుకున్న పోలీసులు అనేక అరెస్టులు చేస్తూ ఉన్న టైం లో ఇలాంటి సంఘటనలు చాలా ఎదురు అవ్వడం తో షాక్ అయ్యారు. ఇవాంకా సందర్శన సందర్భంగా హైదరాబాద్ లోని బిచ్చగాళ్ళందరినీ జైళ్ళ శాఖ అధికారులు తరలిస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఫర్జానా అనే ఒకావిడకి అమెరికా లో గ్రీన్ కార్డ్ ఉంది. కానీ ఒక బాబా చెప్పాడని ఇలా బిచ్చగత్తె గా మారింది. రబియా అనే మరొకావిడ కి చాలా ఆస్తులున్నాయి. వాటిని కొంతకాలం చూసుకోవాల్సిందిగా బంధువులకి అప్పగించి వచ్చి మరీ యాచన చేస్తోంది. 

అదేంటమ్మా తల్లీ అంటే బాబా చెప్పాడు అంటోంది. వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో మరేమైనా సినిమాలు చూసి తయారు అయ్యారో కానీ బాబాలు చెప్పారు అంటూ ఇలా బిచ్చగాళ్ళు గా మారి హైదరబాద్ రోడ్ల మీద తిరుగుతున్నారు కోటీశ్వరులు. వామ్మో అంటూ పోలీసులే ఒక్కసారి షాక్ తిన్న పరిస్థితి. 


మరింత సమాచారం తెలుసుకోండి: