హిట్టు సినిమా కొట్టడం అనేది ఇప్పుడు ఉన్న ఏ డైరెక్టర్ కి అయినా పెద్ద ఛాలెంజ్ అది కూడా చేతిలో ఒక పెద్ద హీరోని పెట్టుకుని బ్లాక్ బస్టర్ కొట్టేసాడు డైరెక్టర్ బాబీ. బాబీ ప్రస్తుతం ఖాళీగా ఉండడం ఒక్కటే అందరినీ కలచి వేస్తోంది.

ఏ హీరో తో బాబీ తదుపరి సినిమా ఉంటుంది ఏంటి అనేది క్లారిటీ అస్సలు ఉండడం లేదు. ప‌వ‌ర్ తో తన స్టామినా చూపించిన బాబి.. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ విష‌యాన్ని  కొచ్చేస‌రికి చ‌తికిలప‌డిపోయాడు.

ఈ ఫ్లాప్ ఎఫ్ఫెక్ట్ ఉన్నా కూడా, జై లవ కుశ సినిమాకి సంబంధించి ఆఫర్ దక్కించుకుని ఎన్టీఆర్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు బాబీ. ఎన్టీఆర్‌ని మూడు విభిన్న పాత్ర‌ల్లో చూపించి స‌క్సెస్ కొట్టాడు బాబి. ‘జై ల‌వ‌కుశ‌’ వ‌చ్చి వెళ్లిపోయింది.

రేపో మాపో టీవీల్లో కూడా వేసేస్తారు. అయితే బాబి నెక్ట్స్ సినిమా ఏంట‌న్న‌ది ఇంత వ‌ర‌కూ తేల‌లేదు. కనీసం అటూ ఇటూ గా ఒక్కటంటే ఒక్క వార్త కూడా బయటకి రావడం లేదు. రవితేజ - బాబీ తో సినిమా అన్నారు అది ఇంకా లేట్ అయ్యేలాగానే కనిపిస్తోంది. ఈలోగా సాయిధ‌ర‌మ్‌తేజ్ తో ఓ సినిమా చేసే ఛాన్సుంద‌ని స‌మాచారం. ఒక‌రిద్ద‌రు యువ హీరోలు కూడా బాబితో క‌ల‌సి ప‌నిచేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్న‌ట్టు స‌మాచారం. బాబి ఎటువైపు అడుగు వేస్తాడో మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: