ఈ మద్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందీ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.  ఏ ముహర్తంలో ఈ అవార్డులు ప్రకటించారో కానీ..ఆ రోజు నుంచి మీడియాలో రచ్చ రచ్చ అవుతుంది.  రాను రాను ఇప్పుడిది రాజకీయ రంగు పులుముకుంటుంది.   కాగా,  ఏపీలో ఆధార్ కార్డు, ఓటు హక్కు లేనివాళ్లే విమర్శలు చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించడం విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాము నాన్-ఆంధ్రా రెసిడెంట్స్ అయితే లోకేశ్ ఎవరని ఎదురు ప్రశ్నించారు.
నంది అవార్డును తీసుకోను
లోకేష్ వ్యాఖ్యల వల్ల తాము తెలుగు రోహింగ్యాలను చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఏపీ ప్రజలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడూ తిట్టలేదని, రాజకీయ నాయకులను మాత్రమే తిట్టారని పోసాని అన్నారు. లోకే‌శ్‌కు ఉన్న మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే... మమ్మల్ని తరిమికొట్టేవారని ఎద్దేవా చెప్పారు. తెలంగాణకు పన్నులు కడుతున్నంత మాత్రాన తాము ఏపీ గురించి మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మీకు ఇళ్లు, వ్యాపారాలు లేవా? అని నిలదీశారు.
 కెసిఆర్‌ను చూసి నేర్చుకోండి
ఒకటి రెండు విమర్శలు చేసినంత మాత్రాన అవార్డులను ఎత్తేస్తారా అని మండిపడ్డారు. నంది అవార్డులు నీ అబ్బ సొత్తా అంటూ లోకేష్‌ను ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి. విమర్శలు చేస్తే స్థానికేతరులు అవుతారా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా?. అప్పుడు చంద్రబాబును ఎవరైనా నాన్‌ లోకల్‌ అన్నారా? నంది అవార్డులు విమర్శిస్తే నాన్‌ లోకల్‌ అంటారా?. 2014 వరకూ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని. అప్పటివరకు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు.
 హైద్రాబాద్‌లో ట్యాక్స్‌లు కట్టేవారిని జ్యూరీలోకి ఎలా?
ఆస్తులు పెంచుకుంటూ ఏపీలో కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చా? అంటూ లోకేష్‌పై పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంపర్ సినిమాకు తనకు వచ్చిన అవార్డును తీసుకోననని ఆయన ప్రకటించారు. ఈ అవార్డు అందుకోవటానికి నేను సిగ్గుపడుతున్నా.. అవార్డు తీసుకుంటే పోసాని ఫలానా సామాజికవర్గమైనందునే ఆయనకు అవార్డు వచ్చిందంటారు..అందుకే ఈ అవార్డును తీసుకోనని ప్రకటించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: