తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన గారాల పట్టీ అర్హా బర్త్ డే సంద్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ అభిమానులకు సర్‌ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.   సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్ ఉండే బన్నీ తాజాగా మరో సామాజిక మాధ్యమంలోకి అడుగుపెట్టాడు.
Image result for allu arjun family
తాజాగా ఇన్స్ స్టాగ్రామ్ లోనూ తన ఫీలింగ్స్ ను షేర్ చేసుకోనున్నాడు. తన కూతురు అర్హా తొలి పుట్టిన రోజు సందర్భంగా తొలి పోస్ట్ చేశాడు. 'నా చిన్నారి ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. అప్పుడే సంవత్సరం గడిచిపోయిందంటే నమ్మలేకపోతున్నాను' అంటూ కామెంట్ చేశాడు. ఈ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే 25 వేలకు పైగా లైక్స్, 1500లకు పైగా కామెంట్స్ వచ్చాయి.
Image result for allu arjun family
ప్రస్తుతం బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.  స్నేహ రెడ్డితో అల్లు అర్జున్ వివాహం 2011లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. తొలుత కుమారుడు అయాన్ జన్మించగా, ఏడాది క్రితం అర్హా జన్మించింది.




మరింత సమాచారం తెలుసుకోండి: