ఈ మద్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందీ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.  ఏ ముహర్తంలో ఈ అవార్డులు ప్రకటించారో కానీ..ఆ రోజు నుంచి మీడియాలో పెను సంచలనాలు సృష్టిస్తుంది.  అది నంది అవార్డులు కావని..కాపు అవార్డులని విమర్శస్తున్నారు కొంత మంది సినిమా ఇండస్ట్రీ బాధితులు. ఇది కాస్త రాను రాను ఇప్పుడిది రాజకీయ రంగు పులుముకుంటుంది.   కాగా,  ఏపీలో ఆధార్ కార్డు, ఓటు హక్కు లేనివాళ్లే విమర్శలు చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించడం విషయం తెలిసిందే.
Image result for posani nara lokesh
ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. లోకేష్ వ్యాఖ్యల వల్ల తాము తెలుగు రోహింగ్యాలను చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఏపీ ప్రజలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడూ తిట్టలేదని, రాజకీయ నాయకులను మాత్రమే తిట్టారని పోసాని అన్నారు. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణ మురళికి ఇండస్ట్రీలో కొంత మంది నుంచి సపోర్ట్ లభిస్తుంది. 
Image result for nandi award
తాజాగా బన్నీవాసు మరోసారి ఈ వివాదం పై స్పందించారు. పోసాని వ్యాఖ్యలు మద్దతు పలుకుతూ 'మనం ఏపీలో పుట్టాం.. ఏపీలో పెరిగాం.. ఏపీలోనే చదువుకున్నాం.. అమెరికాలో కాదు. మనం ఏపీ వాళ్లమని రుజువు చేసువాల్సిన అవసరం లేదు' అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇటీవల ప్రకటించిన అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిదంటూ బన్నీ వాసు స్పందించిన తరువాతే ఇంత వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: