ఏ రంగంలో అయినా ఎవ‌రికి అయినా కెరీర్ స్టార్టింగ్‌లో ఇబ్బందులు త‌ప్ప‌వు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప్ర‌స్తుతం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో టాప్ డైరెక్ట‌ర్‌. ఆయ‌న‌తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూలో ఉండాల్సిన స్టేజ్ ఆయ‌నిది. మాట‌ల ర‌చ‌యిత‌గా కెరీర్ స్టార్ట్ చేసిన త్రివిక్ర‌మ్ ఇప్పుడు టాప్ రేంజ్ డైరెక్ట‌ర్ స్థాయికి వెళ్లిపోయారు. అయితే ఆయ‌న ఈ స్టేజ్‌కు రావ‌డానికి ప‌డ్డ‌క‌ష్టం చాలానే ఉంద‌ట‌. త్రివిక్ర‌మ్ తొలి సినిమా కోసం ఎన్నో క‌ష్టాలు ప‌డ్డార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయనే స్వ‌యంగా చెప్పారు.

naga shourya chalo movie కోసం చిత్ర ఫలితం

తాజాగా నాగశౌర్య, రష్మిక నటించిన ఛలో సినిమా టీజ‌ర్‌ను త్రివిక్ర‌మ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తన శిష్యుడి సినిమా టీజర్‌ని విడుదల చేసిన త్రివిక్రమ్ తన తొలి సినిమా చేదు అనుభ‌వాల‌ను వేదిక‌పై షేర్ చేసుకున్నారు. ఇక తొలిసారి ద‌ర్శ‌క‌త్వం చేసిన‌ప్పుడు ఆ ద‌ర్శ‌కుడి బాధ‌లు ఎలా ఉంటాయో ? త‌న‌కు తెలుస‌ని త్రివిక్ర‌మ్ చెప్పారు.


తొలి సినిమా తీయ‌డం చాలా క‌ష్టం అని త్రివిక్ర‌మ్ చెప్పారు. ఈ క్ర‌మంలోనే త‌న తొలి సినిమాకు తాను ఎన్ని క‌ష్టాలు ప‌డ్డానో ?  కూడా వివ‌రించారు. తాను క‌థ‌, మాట‌లు రాసుకున్న‌ స్వ‌యంవ‌రం సినిమాను తీసి రిలీజ్ చేసేందుకు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాల్సి వ‌చ్చింద‌ని, ఆ సినిమాను ముందుగా ఎవ్వ‌రూ పట్టించుకోలేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 


స్వ‌యంవ‌రం సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు చాలా క‌ష్ట‌ప‌డ్డారు..  ఆ సినిమా హాళ్ల‌లో ఎన్ని రోజులు నడిచిందో.. ప్రివ్యూ థియేటర్లలో కూడా అన్ని రోజులు నడిచింది. ఈ సినిమాను కొనేందుకు ఎవ్వ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో ప్ర‌తి డిస్ట్రిబ్యూట‌ర్‌కు ప్రివ్యూ షో వేసి చూపించాల్సి వ‌చ్చింద‌ని, ఇలా తొలి సినిమాకు తాము ప‌డిన ఇబ్బందుల‌ను త్రివిక్ర‌మ్ చెప్పారు. ఇక త‌న శిష్యుడు సినిమా వెన‌క సినిమా అంటే ఫ్యాషన్ ఉన్న నిర్మాత సాయి కొర్రపాటిగారు ఉండ‌డంతో ఆ ఇబ్బందులు లేవ‌ని నాడు తాను ప‌డ్డ ఇబ్బందుల‌ను త్రివిక్ర‌మ్ గుర్తు చేసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: