అక్కినేని కుటుంబ కోడలుగా మారిన తరువాత కూడ సమంతకు ఇంకా చాల సినిమాలలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా తన నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రల కోసం ఎదురు చూస్తోంది సమంత. ఇప్పటికీ ఆమెకు భారీ పారితోషికాలను నిర్మాతలు ఆఫర్ చేస్తున్నారు అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది. 

సమంత తన కెరియర్ లో సంపాదించిన డబ్బులో ఎంతో కొంత తన ప్రత్యూషా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు ఎప్పటి నుంచో ఖర్చు పెడుతున్న విషయం తెలిసిందే. ఇది చాలదు అన్నట్లుగా సమంత తన వద్ద ఎప్పటి నుంచో మేనేజర్ గా పనిచేస్తున్న మహేందర్ నిర్మించిన ‘బాలకృష్ణుడు’ సినిమాకు ఎవ్వరూ ఊహించని సహాయం చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. 

చిన్న సినిమాల నిర్మాతగా ఇప్పటికే అనేక సినిమాలు తీసిన మహేందర్ లేటెస్ట్ గా నారా రోహిత్ తో కలిసి ‘బాలకృష్ణుడు’ అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమా ఈవారం రిలీజ్ కాబోతోంది. అయితే ఈసినిమా షూటింగ్ ముగింపు దశలో ఉండగా నిర్మాత ఈసినిమా మార్కెట్ కాకపోవడంతో డబ్బు విషయంలో అనేక సమస్యలు ఎదుర్కున్నాడట. దీనితో ఈసినిమా నిర్మాతకు సమంత ఫైనాన్షియల్ గా 3 కోట్ల వరకు హెల్ప్ చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ న్యూస్ చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే సమంత తాను చేసిన సహాయానికిగాను ఈసినిమాకు సంబంధించి కొన్ని ఏరియాల్లో రైట్స్ తీసుకుంది అని టాక్. ఇప్పటికే సమంత చేయిపడితే ఏసినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది అన్న సెంటిమెంట్ ఉన్న నేపధ్యంలో సమంత సహాయం నారా రోహిత్ కోరుకుంటున్న విజయాన్ని ఇస్తుందనుకోవాలి. ఈసినిమా కోసం 21 కేజీల బరువు తగ్గడమే కాకుండా ఈసినిమాను నేటి సగటు ప్రేక్షకుడు కోరుకునే మాస్ ఎంటర్ టైనర్ గా తీయడంతో నారా రోహిత్ కు మళ్ళీ హిట్ దొరికే అవకాశం ఉంది అన్న అంచనాలు ఉన్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: