మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు మెగా ఫ్యామిలీ హీరోల నుంచి సరైన సపోర్ట్‌  రావడంలేదు అన్న గాసిప్పులు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో హడావిడి చేస్తున్నాయి. అతడికి సామాన్య ప్రేక్షకులలో క్రేజ్‌ బాగానే ఉండడంతో ప్రస్తుతం పరాజయాలబాటలో పయనిస్తున్నా తేజుకి అవకాశాలు బాగానే వస్తునాయి. 

అయితే ఈయంగ్ హీరోకి అవకాశాలైతే వస్తూనే ఉన్నాయి కాని అతడు నటించిన సినిమాల రిలీజ్ కు సరైన సీజన్ దొరకడంలేదు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తేజు భారీ కమర్షియల్ డైరెక్టర్ వినాయక్‌ తో కలిసి ఒక భారీ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. తేజు కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా విడుదలకు సరైన రిలీజ్ డేట్ దొరకడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

దీనికి కారణం  ఫెస్టివల్స్‌డేట్స్ అన్ని మిగతా మెగా హీరోలు ముందుగా రిజర్వ్‌  చేసుకుంటూ ఉండటంతో ఈమెగా మేనల్లుడికి ఈ పరిస్థితి పట్టింది అని అంటున్నారు. ‘జవాన్‌’ చిత్రాన్ని దసరాకి విడుదల చేద్దామని అనుకుంటే అది ఇప్పడు రకరకాల డేట్స్ మారి చిట్టచివరకు  డిసెంబర్‌ 1కి  ఫిక్స్ అయింది. ఇదిచాలదు అన్నట్లుగా  వినాయక్ దర్శకత్వంలో రూపొందింపడుతున్న సినిమాను ఫిబ్రవరిలో రాబోతున్న మహాశివరాత్రి రోజున విడుదల చేయాలి అని భావిస్తే ఇప్పడు అదే డేట్ కు  వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’ విడుదలకు రెడీ అవుతోంది. దీనితో ఈ సనిమాను సమ్మర్ రేస్ లో నిలపెడదామని అనుకుంటే వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు రామ్ చరణ్  ‘రంగస్థలం’ అల్లుఅర్జున్ ‘నాపేరు శివ’ లైన్ లో ఉండటంతో  తేజు వినాయక్ ల భారీ సినిమావిడుదలకు మంచి డేట్ దొరకడంలేదు అని అంటున్నారు.

దీనితో ఈయంగ్ హీరో నటిస్తున్న ప్రతి సినిమా విడుదల డేట్ కు ఇలా కాంప్రమైజ్‌ అవుతూపోతే ఇతడి కెరియర్ ఇప్పట్లో చక్కపడే అవకాసం లేదు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మెగా కుటుంబ ఇమేజ్ ని వాడుకుంటూ సినిమాలలోకి వచ్చిన ఈ హీరోకి అదే హీరోల సినిమాలు సమస్యగా మారడం యాదృచ్చికం అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: