ఎవరు ఎలా ఎప్పుడు రాజేసారో కానీ నంది అవార్డుల కుంపటి మాత్రం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రావణ కాష్టం చేస్తోంది. నందీ అవార్డులు పూర్తి పార్శియాల్ గా ఉన్నాయి అనే ప్రతీ ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా మీడియా ముందరకి వచ్చిన పోసాని కృష్ణ మురళి కూడా ఈ అవార్డుల విషయం లో అనేక తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. నంది అవార్డులని ప్రకటించిన పేర్లు రద్దు చేసి కొత్త కమిటీ పెట్టి అవార్డులు మళ్ళీ ఫ్రెష్ గా ఇవ్వాలి అని సూచించారు ఆయన.

అంతే కాదు తనకి వచ్చిన నందిని వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించిన పోసాని ప్రభుత్వం మీద విరుచుకుని పడ్డారు. ప‌రీక్ష‌ల్లో త‌ప్పు జ‌రిగితే, ఎన్నిక‌ల్లో త‌ప్పు జ‌రిగితే వాటిని ర‌ద్దు చేసిన‌ప్పుడు, అవార్డుల్లో త‌ప్పు జ‌రిగితే ఎందుకు ర‌ద్దు చేయ‌రు? అంటూ ఎవ్వ‌రూ లాగ‌ని లా పాయింట్ లాగాడు.

నంది అవార్డుల్లో త‌న పేరు చూసి ముందు ముచ్చ‌ట‌ప‌డ్డాన‌ని, కాక‌పోతే నందిపై `క‌మ్మ అవార్డులు` అనే ముద్ర ప‌డేస‌రికి… దాన్ని అందుకోవాలంటే సిగ్గుగా ఉంద‌ని పోసాని వ్యాఖ్యానించాడు. ఇదంతా నిన్న జరిగింది.

ఈ న్యూస్ ని మీడియా లో చూసిన ఇతర 'కమ్మ' హీరోలు టెక్నీషియన్ లూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లూ కూడా ఇలా అవార్డుల కి కమ్మ ముద్ర పడుతోంది అనే భయంతో వెనక్కి ఇచ్చేయడమో లేక అవార్డు ఫంక్షన్ కి వెళ్ళకుండా ఉండడమో చెయ్యాలని చూస్తున్నారట. ఇప్పటి వరకూ వీరందరి మీదా కేస్ట్ ముద్ర లేదు ఈ అవార్డుల వలన తాము ఒక వర్గం వైపు ఉండిపోయాం అనిపించుకోవడం ఇష్టపడని చాలామంది సైలెంట్ అయిపొదాం అని చూస్తున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: