హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకున్నా ఆమెకు చెప్పుకోతగ్గ అవకశాలు రాకపోతు ఉండటంతో ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘జూలీ 2’ మూవీ ద్వారా తిరిగి ట్రాక్ లోకి రావడానికి ఎంతవరకు ఎక్స్ పోజింగ్ చేయాలో అంతవరకు ఎక్స్ పోజింగ్ చేసి ప్రస్తుతం అందరిదృష్టిని ఆకర్షించడానికి చాలగట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో ఈవారం విడుదల కాబోతున్న ఈమూవీ ఒకప్పుడు దక్షిణాది సినిమారంగాన్ని ఒకఊపు ఊపిన అప్పటి గ్లామర్ హీరోయిన్ నగ్మా జీవితంలోని కొన్ని డార్క్ షేడ్ విషయాలను గుర్తుకు చేసేవిధంగా ఉంటుందని ప్రచారం మొదలైంది.

అయితే ఇటువంటి వార్తలను ఖండించవలసిన ఈసినిమా నిర్మాతలు అదేవిధంగా హీరోయిన్ లక్ష్మిరాయ్ అన్యాపదేశంగా ఈసినిమా కథలోని కొన్నిసన్నివేశాలు నగ్మా జీవితంలోని జరిగిన కొన్ని సంఘటనలకు పోలికతో ఉండటం యాదృచ్చికం అంటూ ఈసినిమా పై మరింత హీట్ ను పెంచుతున్నారు. దీనితో ఒకనాటి సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీయబడ్డ ‘డర్టీ హీరోయిన్’ మూవీలా ఈసినిమాలో కూడ ఏమైనా సంచలనాలు ఉంటాయా అన్నఆసక్తి విపరీతంగా పెరిగిపోతోంది.

ఈసినిమాకు సంబంధించి లీగల్ సమస్యలు రాకుండా వ్యూహాత్మకంగా ఈసినిమా నిర్మాతలు అన్యాపదేశంగా నగ్మా వ్యక్తిగత జీవితాన్ని బేస్ చేసుకుని ఈసినిమా తీసినట్లు జాతీయమీడియాలో కథనాలు వస్తున్నాయి. 1990-2000 మధ్య కాలంలో సౌత్ ను ఓఊపు ఊపిన హీరోయిన్ నగ్మా అప్పట్లో సౌత్ లో పెళ్లయిన ఒకసూపర్ స్టార్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుంది అన్నవార్తలు అప్పటి రోజులలో మీడియాకు హాట్ టాపిక్. 

ఈకారణంతో ఆమెను సౌత్ నుంచి ఎలా బయటకు పంపించారు ఆతరువాత ఆమె భోజ్ పురిలో ఎలా స్టార్ అయి మళ్లీ నిలదొక్కుకుంది లాంటి అంశాలు ఈసినిమాలో యదార్ధంగా తీసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈవిషయాలను  ‘జూలీ-2’  సమర్పకుడు పహ్లాజ్ నిహ్లానీ కూడ ఇన్ డైరెక్ట్ గా చెపుతూ లీకులు ఇస్తున్నాడు. అయితే ఈవిషయాలు నగ్మా దృష్టికి జాతీయమీడియా తీసుకు వెళ్ళడంతో ‘పద్మావతి’ సినిమాలా ఒక సంచలనం క్రియేట్ చేద్దామని ఈసినిమా దర్శక నిర్మాతలు తన పేరును వాడుకుంటున్నట్లు అనిపిస్తోందని అయితే ఈసినిమా విడుదల అయ్యాక ఈసినిమాలో తనను టార్గెట్ చేసినట్లుగా అభ్యంతర సన్నివేశాలు ఉంటే ఈసినిమా పై న్యాయపోరాటం చేస్తానంటోంది నగ్మా.. 



మరింత సమాచారం తెలుసుకోండి: