రాజమౌళి తన తదుపరి సినిమాకు సంబంధించిన సస్పెన్స్ కు తెరతీస్తూ చరణ్ జూనియర్ ల మల్టీ స్టారర్ విషయం బయటపెట్టిన తరువాత ఈసినిమాబడ్జెట్ అదేవిధంగా ఈసినిమాకు జరగబోయే బిజినెస్ కు సంబంధించిన చర్చలు ఊపు అందుకున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడవిడి చేస్తున్న వార్తలప్రకారం ఈభారీ మల్టీ స్టారర్ ఒకకొత్త బిజినెస్ ఫార్మలాలో నిర్మింపబడుతోంది అనిటాక్.

‘బాహుబలి’ ప్రాజెక్ట్ తో నేషనల్ సెలెబ్రెటీ స్థాయికి ఎదిగిపోయిన రాజమౌళి అదేవిధంగా టాలీవుడ్ టాప్ యంగ్ హీరోల స్థాయికి చేరిపోయిన జూనియర్ చరణ్ లు ఈభారీ మల్టీ స్టారర్ కు సంబంధించి ఒక్క రూపాయి కూడ పారితోషికం తీసుకోరట. అయితే ఈభారీ మూవీ ప్రాజెక్ట్ కు జరిగే బిజినెస్ ను నాలుగు భాగాలుగా విభజించి రాజమౌళి చరణ్ జూనియర్ లతో పాటు ఈసినిమాను నిర్మిస్తున్న డీవీవీ దానయ్య కూడ తీసుకుంటారని ఫిలింనగర్ టాక్.

అయితే చరణ్ జూనియర్ రాజమౌళిలకు పారితోషికం లేకపోయినా అత్యంత భారీస్థాయిలో నిర్మించే ఈమూవీ బడ్జెట్ 100 కోట్లు మించి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళికి ఉన్న ఇమేజ్ రీత్యా ఈమూవీని దక్షిణాదిలోని అన్ని భాషలలోను డబ్ చేసి విడుదల చేయడంతో ఈమూవీ పై దాదాపు 300 కోట్ల బిజినెస్ జరిగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు 2018 మధ్యలో ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టి 2019 ప్రధమార్దానికి ఈమూవీ నిర్మాణ పనులుపూర్తిచేసి 2019 సమ్మర్ ను టార్గెట్ చేసేవిధంగా ఈసినిమా రిలీజ్ ప్లాన్ ఉంది అనిఅంటున్నారు. 

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి కథ విషయమై విజయేంద్ర ప్రసాద్ తో రాజమౌళి ప్రాధమిక ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈభారీ మల్టీ స్టారర్ కథను జనవరిలోగా ఫైనల్ చేసి ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన 2017 జనవరి 1న ఇవ్వాలని రాజమౌళి ఆలోచన అనిఅంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ కలక్షన్స్ చరిత్రను సృష్టించిన రాజమౌళి ఇప్పుడు టాప్ హీరోలతో కలిసి పారితోషికం లేకుండా సమిష్టి ప్రాజెక్ట్ గా తీస్తున్న ఈభారీ మల్టీ స్టారర్ మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: