తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వారసత్వపు హీరోల హవా బాగా కొనసాగుతుంది.  ఈ నేపథ్యంలో ఇప్పటికే స్టార్ హీరోల తనయులు హీరోలు గా ఎంట్రీ ఇస్తు తమ సత్తా చూపిస్తున్నారు.  ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు నెంబర్ వన్ రేస్ లో ఉండగా..ఆయన అల్లుడు సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  కాకపోతే  ఇప్పటి వరకు తన కెరీర్ లో సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ మద్య వచ్చిన మల్టీస్టారర్ చిత్రం ‘శమంతకమణి’ కాస్త పరవాలేదనిపించినా..హీరోగా పెద్దగా క్రెడిట్ సంపాదించలేక పోయాడు. ప్రస్తుతం సుదీర్ బాబు వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు.
Image result for sudheer babu
సుధీర్ బాబు నటించిన నెక్స్ట్ మల్టీ స్టారర్ మూవీ అయిన “వీర భోగ వసంతరాయలు” రిలీజ్ కి రెడీ గా ఉంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో ఒక మూవీ ని ఓకే చేసాడు సుధీర్ బాబు. “జెంటిల్ మెన్” నిర్మాత అయిన శివలెంక ప్రసాద్ ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సుదీర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ  అదితి రావు హైదరిని ఓకే చేసారు మూవీ యూనిట్.   
Image result for aditi hydari
ఇక సుధీర్ బాబు పక్కన అదితి హీరోయిన్ అనగానే ఎక్కడ లేని హైప్ వచ్చింది. కానీ ఇంతలోనే మరో షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చిందంటున్నారు చిత్రయూనిట్..తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి తప్పుకుంది అనే టాక్ వినిపిస్తుంది.  పెద్దగా స్టార్ ఇమేజ్ లేని హీరో పక్కన నటించాలంటే..ఈ అమ్మడు బాగానే డబ్బు డిమాండ్ చేసిందట.
Image result
దీంతో సదరు దర్శక, నిర్మాతలు సందిగ్ధంలో పడటంతో  ఈ మూవీ నుంచి వాక్ అవుట్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మోహన్ కృష్ణ మరో హీరోయిన్ వేటలో పడ్డాడు. వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్లనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: