తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య వరుస విజయాలతో దూసుకు పోతున్నారు దర్శకులు కొరటాల శివ. ఈయన దర్శకత్వం వహించిన ‘మిర్చ’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’ లు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.  దీంతో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల లీస్ లో చేరిపోయారు కొరటాాల.  ఇలా వరుస విజయాలతో దూసుకు పోతున్న దర్శకులు కొరటాల ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు.  అయితే ‘ధృవ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మెగా అబ్బాయి రాంచరణ్ తో ఓ సినిమా తీయబోతున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.

Image result for rangasthalam 1985 stills

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘రంగస్థలం 1985’ సినిమాలో నటిస్తున్నారు రాంచరణ్.  అయితే ఈ సినిమా పూర్తియిన తర్వాత కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్ లో ‘మిర్చి’ తర్వాత ఓ సినిమా తీయాల్సి ఉన్నా..స్క్రిప్ట్ విషయంలో చరణ్ అసంతృప్తి కారణంగా ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పుకున్నారు.  ఇప్పుడు మరోసారి అదే విధంగా కొరటాలకు రామ్ చరణ్ హ్యాండ్ ఇవ్వబోతున్నాడా..? అవుననే అంటున్నారు చాలామంది.


రాంచరణ్ 'రంగస్థలం 1985' సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. వేసవికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల శివతో చరణ్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ చరణ్ తన నెక్స్ట్ మూవీని బోయపాటి శ్రీనుతో చేయనున్నట్టుగా తాజాగా ఒక టాక్ వినిపిస్తోంది.

Image result for ram charan boyapati srinivsa

ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లోనే బోయపాటి బిజీగా ఉన్నాడనీ, వచ్చేనెలలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కవచ్చని అంటున్నారు.  మరో వారం రోజుల్లో బోయపాటి సినిమాకు మూహర్తం షాట్ కూడా ఫిక్స్ చేశారట. అయితే మరి కొరటాలతో రాంచరణ్  ఎందుకు గ్యాప్ ఇస్తున్నారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. 




మరింత సమాచారం తెలుసుకోండి: