మెగా హీరో వారసత్వాన్ని కొనసాగిస్తూ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి మెగా స్టార్ స్థానం కోసం చాల కష్టపడుతున్నాడు. సినిమా రంగాన్ని వదిలి 9 సంవత్సరాలు అయిపోయినా తిరిగి ‘ఖైదీ నెంబర్ 150’ గా వచ్చి చిరంజీవి చరిత్ర క్రియేట్ చేసి త్వరలో ‘సైరా’ అంటూ మరో చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాడు. 

ఇప్పుడు ఈతండ్రి కొడుకులు బయట ఎక్కడ కనిపించినా గుబురు గెడ్డాలతో కనిపిస్తున్న నేపధ్యంలో తండ్రీకొడుకులు గడ్డం బాబులుగా మారిపోయారా అన్న సెటైర్లు పడుతున్నాయి. ‘రంగస్థలం’ సినిమా కోసం రామ్ చరణ్ పెంచిన గెడ్డంతో ఇలా ఒక సంవత్సరంగా కనిపిస్తూ ఉంటే వచ్చే నెలలో మొదలు కాబోతున్న ‘సైరా’ కోసం చిరంజీవి ఇలా తన గెడ్డం లుక్ తో సందడి చేస్తున్నాడు. 
Image result for chiru family
అయితే ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే రకమైన గెడ్డం స్టైల్ తోనే కాకుండా ఒకేరకం డ్రస్ కూడ వేసుకుని ఈమధ్య హైదరాబాద్ లోని ఒక కాఫీ షాప్ లో ఒక సాయంత్రం కొద్ది సేపు సందడి చేసారు. అయితే అక్కడకు వచ్చిన కొంతమంది మెగా అభిమానులు వీరిద్దరి ఫోటోలను క్లిక్ మనిపిస్తే ఆ ఫోటో పై చరణ్ కామెంట్ చేస్తూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. ‘కాఫీ టైమ్ ఇది. గెడ్డంతో నేను డాడీ సేమ్ టు సేమ్ కనిపిస్తున్నాం.  కాఫీ కోసం బయటకి తీసుకెళ్లడానికి నాన్నని ఒప్పించడం ఆనందంగా ఉంది’ అంటూ కామెంట్ చేసాడు. 

చిరంజీవి చరణ్ లు తండ్రి కొడుకులుగా కాకుండా మంచి స్నేహితులా ఉంటారని చాలామంది అంటూ ఉంటారు. దీనికి బలం చేకూర్చే విధంగా ఒకే డ్రెస్ తో కనిపిస్తున్న ఈ మెగా హీరోలిద్ధరిని ఒకే లుక్ లో చూస్తున్నందుకు మెగా అభిమానులు మురిసిపోతూ ఆ ఫోటోకు వేల సంఖ్యలో లైక్ లు కొడుతున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఫోటోగా మారిపోయింది..


మరింత సమాచారం తెలుసుకోండి: