బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘పద్మావతి’ అనేక వివాదాలకు కేంద్రబిందువు అయ్యింది. ఈ చిత్రంలో రాణిగా దీపికా పదుకొనే, షాహిద్ కపూర్ పద్మావతి భర్తగా, రణ్‌వీర్‌ సింగ్‌ రాజు అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ  సినిమాలో నటించారు. సినిమా విడుదల కాకముందే చిత్రాన్ని రాజస్థాన్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమా మీద నిషేధం విధించారు.

పద్మావతి చిత్రం వల్ల రాజ్ పుత్ ల మనోభావాలు దెబ్బతిన్నాయి అని,  నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. ఈ సినిమాలో నటించిన దీపికా పదుకొనే తలకాయను  నరికితే ఐదు కోట్లు ఇస్తామని ఒక సంస్థ  ప్రకటించడంతో చిత్ర యూనిట్ భయాందోళనలకు గురి అయింది. పద్మావతి సినిమాలో చరిత్రను వక్రీకరించి తీసారని రాజ్ పుత్ ల ప్రధాన ఆరోపణ."ఇది కేవలం ఆరోపణ మాత్రమే.

సినిమా మీద వస్తున్న నిరసనలపై ప్రభుత్వం వ్యవహరించే తీరు బాధాకరం గా ఉంది. మేము చరిత్రను వక్రీకరించలేదు. ఇందులో ఏదైనా తప్పు వుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెన్సార్ చూసుకుంటుందని” చిత్ర యూనిట్ ఎంత చెబుతున్నా వినడం లేదు వారంతా , అసలు సినిమా విడుదలకు ముందే, సినిమా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయనడం విచారకరం.

అభ్యంతరకర  సన్నివేశాలు ఉంటే దాన్ని కట్  చేయడానికి సెన్సార్ బోర్డ్ ఉంటుంది. మహిళ భద్రతను ఈ ప్రభుత్వం  చూసుకుంటుంది అని ఉపన్యాసాలు ఇచ్చే మోడీ సర్కార్...సాటి మహిళ తలను నరుకుతాం  అని బహిరంగంగా ప్రకటన చేసిన చర్యలు తిసుకోకపోవడం నిజంగా దారుణం. ఏదైనా అభ్యంతరం వుంటే సెన్సార్ వాళ్ళు చూసుకుంటారు అని ప్రభుత్వం తరపునుండి ఎవరూ ఒక మాట కూడా చెప్పడం లేదు. దీని  అర్ధం ప్రభుత్వ వ్యవస్థలపై ప్రభుత్వనికే నమ్మకం లేదనా? ఇప్పటికైనా మోడీ సర్కారు ఇలాంటి మూర్ఖపు సంస్థలనీ వాటిని ఇలా హింసాత్మకంగా నడిపెవారినీ అడ్డుకోవాలి. బహిరంగంగా ఒక హీరోయిన్ తల నరకమని డబ్బులు ఇస్తాం అని చెబుతుంటే ప్రభుత్వ పెద్దలు మిన్నకుండడం అనేది చాలా బాధాకరం .


మరింత సమాచారం తెలుసుకోండి: