ఆ మద్య మాలీవుడ్ హీరోయిన్ భావన పై ఆమె కారు డ్రైవర్ అత్యాచార యత్రం..లైంగిక వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే.  దీనిపై ఆమె పోరాటం చేసి నింధితులకు శిక్షపడేలా చేసింది.  ఇదే స్ఫూర్తితో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తమపై జరిగిన లైంగిక వెధింపుల గురించి గళం విప్పారు.  ఇక సినిమా ఇండస్ట్రీలో తారలుగా వెలిగిపోవాలని ప్రతి ఒక్కరీ ఆశ ఉంటుంది.  కానీ కొంత మంది బ్రోకర్ల చేతుల్లో పడ్డ అమాయక అమ్మాయిలు తమ జీవితాలు నాశనం చేసుకుంటారు. మరికొంత మంది అమ్మాయిలు గత్యంతరం లేక వేశ్యావృత్తిలోకి వెళ్తారు. 
Related image

తాజా సినిమా హీరోయిన్ కావాలని ప్రతి ఒక్కరికీ ఆశ ఉంటుంది..ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. ఆ ఛాన్స్ దొరికిందంటే హీరోయిన్‌గా సెటిల్ అయిపోవచ్చు.  ఊహాలోకంలో విహరిస్తూ.. రంగుల ప్రపంచమైన సినిమా ఇండస్ట్రీ వైపు పరుగులు తీస్తుంటారు చాలా మంది అమ్మాయిలు. అయితే ఆ రంగుల ప్రపంచంలో విహరించాలంటే చాలా ఒడుదొడుకులు ఉంటాయని వాటిని తట్టుకోవడం చాలా కష్టమే అంటోంది గ్లామర్ హీరోయిన్ రాయ్‌లక్ష్మీ.  అయితే జాలీ-2లో తాను పోషించిన పాత్ర.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న రియాలిటీ దగ్గరగా ఉంటుందన్నారు.

Related image
ఇటీవల ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు గురించి చాలా మంది వారి అనుభవాలను తెలియజేశారని.. అయితే ఏదో ఒక సందర్భంలో ఇలాంటి పరిస్థితులు తరచూ ఎదరౌతాయన్నారు. తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు చవిచూశానని..తమిళంలో ‘కర్క కచడర’ చిత్రం ద్వారా తనకు తొలి అవకాశం వచ్చిందన్నారు. ఆ సినిమా తరువాత నాలుగేళ్ల పాటు సినిమా అవకాశాల కోసం చేయని ప్రయత్నం లేదన్నారు. 
Image result for laxmi rai
ఇండస్ట్రీలో పైకి రావాలంటే.. సెక్స్ రిలేషన్స్‌ ఉంటేనే అవకాశాలు ఉంటాయనే విషయం తనకు అర్థమైందన్నారు. ఆ టైంలో తాను ఎవరికీ లొంగలేదు కనుకనే ఇప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేకపోయానని.. అప్పుడు నాతో చాలా మంది పరిస్థితులతో సర్థుకుపోవాలని సలహా ఇచ్చారని కానీ నేను ఎవ్వరికీ లొంగలేదని అలా చేస్తే స్టార్ హీరోయిన్ ఎప్పుడో అయ్యేదాన్నంటూ సంచలన కామెంట్స్ చేసింది రాయ్‌లక్ష్మీ.

మరింత సమాచారం తెలుసుకోండి: