ఆంధ్ర రాజధానిగా అమరావతి దేశంలోనే నెంబర్ 1 సిటీగా చేసే ప్రయత్నంలో సిఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఇక సిని పరిశ్రమను కూడా హైరాబాద్ నుండి ఏపికి తరలించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వైజాగ్ లో సిని స్టూడియోలు నిర్మించగా ఇప్పుడు ఆంధ్ర రాజధాని అమరావతిలో కూడా స్టూడియోలను నిర్మించాలని చూస్తున్నారు.


ముందుగా రామానాయుడు తనయుడు బడా నిర్మాత సురేష్ బాబు అమరావతిలో రామానాయుడు స్టూడియో నిర్మించాలని చూస్తున్నారట. దీని గురించి ఏపి సిఎం చంద్రబాబు నాయుడితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆడియో ఫంక్షన్లు అమరావతిలో నిర్వహిస్తుండగా ఇక రానున్న రోజుల్లో సిని పరిశ్రమను కూడా అక్కడికి తరలించాలని చూస్తున్నారు.


అయితే బాలకృష్ణ మాత్రం వైజాగ్ లోనే సిని స్టూడియోలు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారట. అమరావతిలో కన్నా వైజాగ్ లో స్టూడియోలు ఇంకా మరిన్ని నిర్మించాలని ప్లాన్ చేయాలని చూస్తున్నారట. అయితే వైజాగ్ లో ఇప్పటికే రామానాయుడు స్టూడియో ఉంది. ఇప్పుడు అమరావతిలో కూడా స్టూడియో కట్టాలని చూస్తున్నారు. 


ప్రభుత్వం తరపున భూమి కేటాయిస్తే సురేష్ బాబు స్టూడియో కట్టేందుకు సిద్ధం అంటున్నాడట. మొత్తానికి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టాలీవుడ్ ఇప్పుడు ఆంధ్రాకి తరలించాలని చూస్తున్నారు. మరి అది ఎప్పటికి పూర్తి స్థాయిలో అవుతుందో తెలియదు కాని మొత్తానికి ప్రయత్నాలు మాత్రం మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: