చైతు సమంత.. టాలీవుడ్ లీడింగ్ స్టార్స్.. ఏమాయ చేసావే సినిమాతో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. సమంత చైతు ప్రేమ ఎంత గొప్పదో చైతు సమంతను ఎంతగా ప్రేమిస్తుందో ఆమె మాటల్లోనే అర్ధమవుతుంది. ఈరోజు నాగ చైతన్య పుట్టినరోజు కానుకగా సమంత నా సర్వస్వం నువ్వే అంటూ మెసేజ్ పోస్ట్ చేసింది.


పెళ్లి తర్వాత మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న చైతుకి సమంత విష్ చేయడం కాదు.. నీ మనసులో నువ్వేం కోరుకుంటున్నావో అది ఇవ్వమని దేవుడిని ప్రార్ధిస్తున్నా అంటూ మెసేజ్ పెట్టింది. నా సర్వస్వం నువ్వే అనే మాట సమంత పెట్టడం అందరిని ఇంప్రెస్ చేసింది. చైతన్య మీద ఉన్న ప్రేమను ఇలా బయటపెట్టిన సమంత ఆమె మంచి మనసుకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.


ఇక పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో కంటిన్యూ చేస్తానని చెప్పింది. అయితే ఇదవరకులా కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా పాత్ర ప్రాధ్యత ఉన్న సినిమాలే చేస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం తమిళంలో విశాల్ సరసన అభిమన్యుడు సినిమా చేస్తున్న సమంత తెలుగులో రాం చరణ్ రంగస్థలం సినిమాలో నటిస్తుంది. క్రిస్టియన్ పద్ధతిలో జరిగిన మ్యారేజ్ పిక్ గ్రీటింగ్స్ పెట్టి మెసేజ్ పోస్ట్ చేసింది సమంత. అక్కినేని కోడలిగా సమంత అనందరి మనసులను గెలుచుకుంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: