అఖిల్ హీరోగా నటిస్తున్న ‘హలో’ ఎట్టి పరిస్తుతులలోను సూపర్ హిట్ చేయాలనే తలంపుతో ఈసినిమాకు సంబంధించి సెంటిమెంట్స్ పరంగా కూడ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు అక్కినేని నాగార్జున. ఈసినిమాను చాలా భారీగా ప్రమోట్ చేయడంతో పాటు ఈమూవీకి సమంత సెంటిమెంట్ ను కూడ కలపాలని నాగ్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీనితో ఈమూవీలో సమంత కోసం ఒక ప్రత్యేక పాత్రను సృష్టించి ఆమె చేత ‘హలో’ సినిమాలో ఒక అతిథి పాత్ర చేయించడానికి రంగం సిద్ధం అయినట్లు టాక్. దీనికోసం సమంత అఖిల్ లపై కొన్ని సన్నివేశాలు అతిత్వరలో చిత్రీకరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఈమూవీలో ఒక సీన్ లో నాగార్జున అమల అఖిల్ లు కలిసి నటించే సీన్ కూడ ఉంది అని అంటున్నారు. 

దీనితో ‘హలో’ ను సూపర్ హిట్ చేయడానికి టోటల్ గా అక్కినేని ఫ్యామిలీ కదులుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. క్రియేటివ్ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ విడుదలకు ఇక నెల మాత్రమే మిగిలి ఉండటంతో ఈసినిమా క్రేజ్ ను పెంచడానికి సమంత గోల్డెన్ లెగ్ ను వాడుతున్నారనుకోవాలి. వదినతో కలిసి అఖిల్ నటించే ఈ సీన్స్ లో డైలాగులు కాస్త ఎమోషనల్ గా ఉంటాయని అంటున్నారు. 

వ్యక్తిగత జీవితంలో కూడ తన వదిన సమంతతో మంచి రిలేషన్ మెయిన్ టైన్ చేసే అఖిల్ ఒక ప్రముఖ షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ లుగా కలిసి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సమంత ‘హలో’ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర చేయబోతోంది కాబట్టి ఆమెచేత కూడ ఈసినిమాను ప్రమోట్ చేయించాలి అన్న ఉద్దేశ్యంలో నాగ్ ఉన్నట్లు టాక్. అయితే వరస విజయాలతో దూసుకు పోతున్న నాని ‘ఎంసిఏ’ ‘హలో’ టార్గెట్ చేస్తూ ఇంచుమించు ఒకే సమయంలో విడుదల అవుతున్న నేపధ్యంలో నాని సినిమా వల్ల అఖిల్ ‘హలో’ కు కలక్షన్స్ విషయంలో సమస్య వస్తుందా అన్న టెన్షన్ ఇప్పటికే నాగార్జునను వెంటాడుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: