పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అజ్ఞాతవాసి అని దాదాపు కన్ఫాం అయినట్టే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 


ఇప్పటికే బయటకొచ్చి చూస్తే అంటూ ఓ సాంగ్ తో తన టాలెంట్ చూపించిన అనిరుద్ సినిమాలో ఐటం సాంగ్ అదరగొట్టాడని అంటున్నారు. ఐటం అనగానే హై ఓల్టేజ్ షురూ చేస్తారు. కాని అనిరుద్ స్టైల్ లో ఐటం సాంగ్ డిఫరెంట్ గా ఉంటుందట. అనిరుద్ ఐటం సాంగ్ కోసం ఇచ్చిన ట్యూన్ సినిమాకే హైలెట్ అని అంటున్నారు చిత్రయూనిట్.


ఇక ఈ ఐటం సాంగ్ లో డిజె భామ పూజా హెగ్దె నర్తిస్తుందని అంటున్నారు. ముకుందతో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు డిజెలో బికిని వేస్తేనే కాని ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో సాక్ష్యం మూవీలో నటిస్తున్న పూజా పవర్ స్టార్ పక్కన ఐటం గాళ్ ఛాన్స్ పట్టేసిందట.


ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్ 27 సాయంత్రం రిలీజ్ చేస్తారని అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. సంక్రాంతి బరిలో దుమ్ము దులిపేందుకు వస్తున్న అజ్ఞాతవాసి సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: