ఒకహీరో సినిమా విడుదల అవుతున్నప్పుడు ఆహీరో దృష్టి అంతా ఆసినిమా పైనే ఉంటుంది. తన సినిమా బాగా ఆడాలని మంచి సమీక్షలు రావాలని మనసు నిండా కోరిక ఉన్నా ఆసినిమాతో పోటీగా వస్తున్న మిగతా హీరోల సినిమాలు కూడ మంచి విజయాన్ని అందుకోవాలని మీడియా ఇంటర్వ్యూ లలో కామెంట్స్ చేయడం ఇప్పడు ఒక సాంప్రదాయంగా మారంది. అయితే వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తన  కెరీర్ లో ఇప్పటికీ సరైన సక్సెస్ లేక సతమత మవుతున్న నారా రోహిత్ ఈరోజు తన  ‘బాలకృష్ణుడు’  సినిమాతో పోటీగా విడుదల అవుతున్న  శ్రీవిష్ణు 'మెంటల్ మదిలో'. 

 సినిమా విషయంలో అనుసరిస్తున్న స్ట్రాటజీ ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘బాలకృష్ణుడు’ సినిమాతో రోహిత్ తన కెరియర్  బ్రేక్ కోసం ట్రై చేస్తున్న  మాస్ మసాలా కమర్షియల్ సినిమా. ఇక శ్రీవిష్ణు 'మెంటల్ మదిలో' లో పై ఇప్పటికే మంచి పాజిటివ్ టాక్ ఉంది. అయితే ఈవిషయాలు పట్టించుకోకుండా శ్రీవిష్ణు సినిమా ఎలాగైనా బాగుండాలని మంచి సమీక్షలు రావాలని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాడట నారా రొహిత్. 

అంతేకాదు ఈసినిమాకు మంచి పబ్లిసిటీ ఉండాలని మంచి హైప్ రావాలని తనకు తెలిసిన మీడియా మిత్రులను ఆ సినిమా పై మంచి రివ్యూలను రాయమని అడుగుతున్నాడట రోహిత్. దీనితో ఈ నారావారి హీరో వైఖరి తన సినిమాతో పోటీగా శ్రీవిష్ణు సినిమా విడుదల అవుతున్నా పట్టించుకొకుండా ఇంత సహాయం చేస్తున్నాడు ఏమిటి అని చాలామంది ఆశ్చర్య పోతునట్లు టాక్. 

దీనికితోడు నిన్న నారా రోహిత్ ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన గోపాల కృష్ణుడుతో పాటు 'మెంటల్ మదిలో' ని కూడ ప్రమోట్ చేసాడు. గతంలో నారా రోహిత్ ఓ దశలో ఒంటరి అయిపోయిన సందర్భంలో శ్రీవిష్ణు అతడి పక్కన వీడకుండా ఉన్నాడట. ఇప్పుడు నారా రోహిత్ చుట్టూ చాలామంది ఉన్నా తనను కష్టకాలంలో అంటిపెట్టుకుని ఉన్న శ్రీ విష్ణు అంటే రోహిత్ కు చాలా ఇష్టం అని చేపుతున్నాడట. అందుకే ఈ విధంగా రోహిత్ తన రుణాన్ని తీర్చుకుంటున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: