భారీ పాటలు అంటే హీరోయిన్ల డ్రెస్ లు కూడా అంత హడావుడిగానూ వుంటాయి. పాట అంతా అయ్యాక చూడ్డానికి బాగానే వుంటుంది కానీ, పాట చేసేటపుడు హీరోయిన్ల బాధలు ఇన్నీ అన్నీ కావు. హెవీ లైటింగ్ వేడి నడుమ ఈ ప్రత్యెక దుస్తులతో నృత్యం చేయడం అంటే మాటలు కాదు
ఇలాంటి పరిస్థతి ఏర్పడిందట ఇటీవల సమంతకు. అత్తారింటికి దారేది సినిమాలో కీలకమైన పాటకు సమంత చాలా బాగా నృత్యం చేయాల్సి వచ్చింది. అందుకు తగ్గ దుస్తులు వేసుకోవాల్సి వచ్చింది. దీంతో పాట పూర్తయ్యేసరికి ఆమె చాలా ఇబ్బంది పడిందట.
ఎంత త్వరగా ఆ దుస్తులు విప్పేస్తానా అని తెగ ఎదురు చూసిందట. ఆఖరికి పాట అవగానే తన చాంబర్లోకి పరుగెత్తి అర్టెంట్ గా డ్రెస్ చేంజ్ చేసేసిందట. పాపం హిట్ పాట కావాలంటే పాపలు ఎంత కష్టపడాలో?

మరింత సమాచారం తెలుసుకోండి: