తమిళ, తెలుగు, కన్నడ అభిమానుల ఆశీర్వాదంతో తన వివాహం ఆనందంగా జరిగిందని సినీ నటి నమిత తెలిపింది. తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ లో వివాహం అనంతరం నమిత మాట్లాడుతూ, తనను ఆదరించిన టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.ఇక నవంబ‌ర్ 22న వీరి సంగీత్ తిరుపతిలోని సింధూరి పార్క్ హయత్ హోటల్ లో సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. మియా అనే చిత్రంలో వీరేంద్ర‌తో క‌లిసి న‌టించింది న‌మిత‌.

ఆ టైంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుట్టింది. ఒకప్పుడు నమితకు తమిళంలో స్టార్ హీరోస్ కి ఉన్న క్రేజ్ ఉండేది. 1998లో మిస్ సూరత్ గా ఎన్నికైన నమిత … 2012 లో సొంతం చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత తమిళ చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నమిత నటన, గ్లామర్ కు ఫిదా అయిన తమిళ అభిమానులు ఆమెకు గుడి కూడా కట్టించిన సంగతి తెలిసిందే.

తెలుగు లో జెమిని, సొంతం చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది.  సరైన హిట్టు ఏదీ దక్కకపోయినా.. దశాబ్దంన్నర నుంచి నమిత తన ఉనికిని నిలుపుకొంటూ వస్తోంది. కొన్నేళ్లుగా తమిళనాట మంచి ఆదరణతో సాగుతోంది.

ఇప్పుడు తన 36వ యేట నమిత వివాహిత అయ్యింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలతో పాటు, తెలుగు, తమిళ చిత్రరంగానికి చెందిన పలువురు సినీ నటులు హాజరు అయ్యారు. రాధిక, శరత్‌కుమార్‌…వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. 

Image result for namitha marriage



మరింత సమాచారం తెలుసుకోండి: