పవన్ కళ్యాణ్ 25వ సినిమాకు సంబంధించి ప్రీ లుక్ ను ఈసినిమా నిర్మాతలు విడుదల చేస్తూ ఈమూవీ టైటిల్ ను నవంబర్ 27వ తేదీన ప్రకటిస్తామని తెలియచేసిన కొద్ది గంటలకే ఈ ప్రీ లుక్ అదిరిపోయింది అంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానుల హడావిడి మొదలైంది. అయితే కిటికీలోంచి సూర్యోదయాన్ని చూస్తూ పవన్ నిలబడి ఉన్న ఈఫోటోని పవన్ అభిమానులు అత్యంత ఆసక్తిగా చూస్తూ ఉన్నా మరొక షాకింగ్ రూమర్ ఈ మూవీ టైటిల్ పై ఇప్పుడు మొదలైంది. 

ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ‘అజ్ఞాతవాసి’ గా పాపులర్ అయిపోయినా ఆ టైటిల్  కాకుండా మరో టైటిల్ ను ప్రకటించే ఆలోచనలు కూడ ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం ఊపు అందుకుంది. అయితే ఇప్పటికే ‘అజ్ఞాతవాసి’ టైటిల్ మారుస్తారంటూ ప్రొడక్షన్ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది అని సమాచారం. 

కానీ హారిక హాసిని బ్యానర్ పేరు మీద ఇంతవరకూ ఫిల్మ్ ఛాంబర్ లో కొత్త టైటిల్ ఏదీ రిజిస్టర్ కాని నేపధ్యంలో ఈసినిమా పై గిట్టని వాళ్ళు ఇలాంటి ప్రచారం మొదలు పెట్టారు అనే కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈసినిమా టైటిల్ కు సంబంధించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మరికొన్ని సూచనలు కూడ అందుతున్నట్లు టాక్.

‘అజ్ఞాతవాసి’ అన్న టైటిల్ లో వేదాంత పరమైన సంకేతాలు కనిపిస్తున్న నేపధ్యంలో ఒక భారీ కమర్షియల్ సినిమాకు ఇలాంటి టైటిల్ ఎంతవరకు మాస్ ప్రేక్షకులను కనెక్ట్ చేసే విధంగా ఉంటుంది అన్న ఆలోచనలు కూడ త్రివిక్రమ్ ను ఆలోచింప చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసినిమాకు సంబంధించి టైటిల్ ఇప్పటివరకు ప్రకటించకపోయినా ఇప్పటికే పవన్ అభిమానులలోకి చొచ్చుకుని పోయిన ఈ టైటిల్ ను మార్చే సాహసం త్రివిక్రం చేయదు అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: