టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచుర‌ల్ స్టార్ పేరు తెచ్చుకున్న నాని గత మూడు సంవత్సరాల నుంచి వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు.  ఈ హీరో లవ్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బేస్ క‌థాంశం ఉన్న‌ సినిమాల్లో నటిస్తూ మంచి విజయం సాధిస్తున్నాడు.  ఈ సంవత్సరం మూడు సినిమాలు వరుస విజయాలు సాధించాయి. ప్రస్తుం వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు బ్యాన‌ర్‌లో ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ నటించారు. ఈ సినిమా టీజర్, సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. దీంతో ‘ఎంసీఎ’ పై భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి. 

nani mca movie కోసం చిత్ర ఫలితం

క్రిస్మ‌స్ కానుక‌గా సెల‌వుల‌ను యూజ్ చేసుకునేలా సినిమాను డిసెంబ‌ర్ 23న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఇక్కడే నానికి చిక్కులొచ్చి పడ్డాయి. టాలీవుడ్‌లో అదే టైంలో ఇద్ద‌రు ప్ర‌ముఖుల వార‌సుల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో నాని సినిమాను ముందుకు జరిపించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. వాస్తవానికి డిసెంబ‌ర్ మూడో వారంలో రిలీజ్ చేస్తే సెల‌వుల‌ను టార్గెట్‌గా చేసుకుని మంచి వ‌సూళ్లు సాధించ‌వ‌చ్చ‌ని ఆ సినిమా యూనిట్ ప్లాన్ చేసింది. అదే టైంలో అక్కినేని వార‌సుడు అఖిల్ రెండో సినిమా హ‌లో వ‌స్తోంది. నాగార్జున నిర్మాత‌గా విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను క్రిస్మ‌స్ కానుకగా డిసెంబ‌ర్ 23న రిలీజ్ చేస్తున్నారు.

akhil hello movie కోసం చిత్ర ఫలితం

ఇక డిసెంబ‌ర్ 24న అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు శిరీష్ హీరోగా తెర‌కెక్కిన ఒక్క క్ష‌ణం సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వీరిద్ద‌రు ఎక్కువ థియేట‌ర్లు బుక్ చేసుకోవ‌డంతో పాటు దిల్ రాజును ఒప్పించి నాని ఏంసీఏ సినిమాను వారం రోజులు ముందుకు జరిపించే ప్ర‌య‌త్నాలు గ‌ట్టిగా జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.  ఒకవేళ ఇదే జరిగితే.. ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ సినిమాకు భారీ క‌లెక్ష‌న్లు రావ‌డం కూడా క‌ష్ట‌మ‌వుతుంద‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ఏదేమైనా మంచి పాజిటివ్ బ‌జ్ ఉన్న నాని సినిమాకు ఇలాంటి ఇబ్బంది రావ‌డం అభిమానులు బాధపడుతున్నారు. 


allu sirish okka kshanam movie కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: