ఈ మద్య సినిమా తారలు ఒక్కొక్కరూ కాలం చేస్తున్న విషయం ఇండస్ట్రీని ఎంతో కలచి వేస్తుంది.  తాజాగా మళయాళ సినీ, బుల్లితెర నటి వాసంతి కన్నుమూశారు. గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం కన్నుమూశారు. నాటక రంగంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన టి.వాసంతి.. తర్వాత చిత్రాలు, సీరియళ్లలో నటించారు.

దాదాపు ప్రతీ మళయాళ టాప్‌ హీరోల పక్కన ఆమె నటించారు. యవనిక, పుచ్చకోరు ముక్కుతి, నిరాకూటు, గాడ్‌పాధర్‌ ఆమె చేసిన చిత్రాల్లో ప్రముఖమైనవి. ఆమె సుమారు 450 చిత్రాల్లో నటించారు.

ఇటీవల వాసంతి భర్త కూడా చనిపోయాడు. వాసంతికి పిల్లలు లేరు. మంగళవారం సాయంత్ర తోడుపుఝాలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: