బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  ఫృథ్విరాజ్ కపూర్ నుంచి మొదలుకొని ఈ తరం రణబీర్ కపూర్ వరకు ఎంతో మంది హీరోలు బాలీవుడ్ ని ఏలారు.   అంతే కాదు ఈ ఫ్యామిలీ నుంచి హీరోయిన్లు కూడా ఎంట్రీ ఇచ్చారు.  రణదీర్ కపూర్ కూతుళ్లు కరిష్మాకపూర్, కరీనా కపూర్ లు ఇద్దరు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు.  అయితే కరిష్మాకపూర్ కొంత కాలానికి నటనకు గుడ్ బాయ్ చెప్పగా కరీనా మాత్రం సినిమాలు చేస్తూనే ఉంది. 
Image result for kareena saif
బాలీవుడ్ హీరో సయిఫ్ అలీ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ మద్య ఓ బాబు కి కూడా జన్మనిచ్చింది.   ఇక బాలీవుడ్ లో మోడలింగ్ ప్రపంచంలో ఫొటోషూట్స్ చాలా కామన్ అని అందరికి తెలిసిందే. ఈ మధ్య మ్యాగజైన్లు కూడా చాలా ఎక్కువైపోయాయి.  ఈ మద్య పాపులర్ మ్యాగజైన్లకు స్టార్ హీరోయిన్లు చాలా హాట్ హాట్ గా ఫోటో షూట్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. 
Image result for karina hot
తాజాగా కరీనా కపూర్  బజార్ బ్రైడ్ మ్యాగజైన్ కి హాట్ స్టిల్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో కొన్ని ఫొటోషూట్స్ లో పాల్గొన్న కరీనా ఎప్పుడు ఇంత హాట్ గా కనిపించలేదు.మనీష్ మల్హోత్రా లేటెస్ట్ బ్రైడ్ కలెక్షన్స్ కోసం ఇచ్చిన ఆ ఫొటో షూట్ అందరిని ఆకట్టుకుంటోంది.  అయితే ఈ అమ్మడికి పెళ్లైనా..బాబు పుట్టినా తన అందం విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదని కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: