ఈ మద్య టాలీవుడ్ లో చారిత్రాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.   ఈ నేపథ్యంలో గుణశేఖర్ నిర్మించిన ‘రుద్రమదేవి’, డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లాంటి సినిమాలకు మంచి ఆదరణ లభించింది. టావువుడ్ లో అశేషప్రజాదరణ పొందిన మెగాస్టార్ చిరంజీవి పది సంత్సరాల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.  ఆ సినిమా అనుకున్నదానికన్నా ఎక్కువ రిజల్ట్ వచ్చింది.  కలెక్షన్లు కూడా దుమ్మురేపాయి..దీంతో చిరంజీవి తన తదుపరి చిత్రం కోసం పూర్తిగా సన్నద్ధం అయ్యారు. 

రాంచరణ్ తో ధృవ లాంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన సురేందర్ రెడ్డితో బ్రిటీష్ పాల‌కుల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన తొలి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి చరిత్ర ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించబోతున్నారు.  సైరా చిత్ర యూనిట్ డిసెంబర్ 6 నుండి రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అవుతోంది.
Image result for sai ra narasimha reddy
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో చిరు సైరా మూవీ కోసం మేకోవర్‌పై శ్ర‌ద్ధ పెట్టారు.  ఇందుకోసం చిరంజీవి పూర్తిగా సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.  ప్రతిరోజు జిమ్ లో ఎక్కువ సమయం గడుపుతూ చాలా వరకు సన్నబడ్డారు. దీనికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.   
Image result for sai ra narasimha reddy
ఈ ఫోటోలో చిరంజీవి టీ షర్ట్, నైట్ ప్యాంటు వేసుకొని మెగాస్టార్ కనిపిస్తున్నారు.   డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎలా రూపొందిస్తాడో వేచి చూద్దాం. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: