పక్కాగా ఈనేల 7న వచ్చి తీరుతుందని అనుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా 'అత్తారింటికి దారేది' వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లోని ఈసినిమా కోసం పవన్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు
కానీ సమైక్య ఉద్యమ నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా వేయాలని నిర్మాత యోచిస్తున్నారు. ప్రస్తుతానికి 9 వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించారని తెలిసింది.పరిస్థితి చూసి 7న లేదా 9న విడుదల చేస్తారు. తప్పకుంటే వాయిదా మరో వారం వేయాలని కూడా అనుకుంటున్నారు.
మొత్తానికి మెగా శిబిరానికి చెందిన రెండు భారీ సినిమాలు 'ఎవడు', 'అత్తారింటికి దారేది' సినిమాలకు ఉద్యమాల సెగ తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: