టాలీవుడ్ అందగాడు మహేష్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్స్ లో కూడా మహేష్ లాంటి అందగాడు లేడనే చెప్పాలి. హాలీవుడ్ కటౌట్ తో మహేష్ టాలీవుడ్ ను ఏలుతున్నాడు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా మహేష్ స్టార్ క్రేజ్ మాత్రం చెక్కుచెదరదు.


ఇక మహేష్ గురించి పలువురు స్టార్స్ కూడా అదే రేంజ్ లో పొగడటం మనం చూస్తుంటాం. రీసెంట్ గా ఆ ఖాతాలో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కూడా చేరాడు. జవాన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న తేజ్ సినిమా విశేషాలతో పాటుగా జనరల్ విషయాలను పంచుకున్నాడు. ఇక మహేష్ ప్రస్థావన రాగా మహేష్ మించిన అందగాడు ఉంటాడా సమస్యే లేదు.. అసలు అలా ఆలోచించడం కూడా వేస్ట్ అనేశాడు తేజ్.


మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మాత్రమే కాదు అతని చార్మింగ్ గురించి సాటి హీరోలే మాట్లాడటం గొప్ప విషయమని చెప్పొచ్చు. ఇదవరకే చరణ్ కూడా మహేష్ లో ఉన్న అందం తనకు ఇచ్చి ఉంటే బాగుండేది అని చెప్పాడు. ఇప్పుడు సాయి ధరం తేజ్ ఏకంగా మహేష్ ను మించిన అందగాడు లేడని అంటున్నాడు.


తన స్టార్ ప్రస్థానంలో మహేష్ తన లుక్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే తన గురించి అందరు ఇలా చెప్పుకుంటున్నారు. మహేష్ అందగాడే కాదు అంతకుమించి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాడు అన్నది తనతో పనిచేసిన వారు చెప్పే మాట.    



మరింత సమాచారం తెలుసుకోండి: