పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్ ఇంకా జరగకుండానే ఈమూవీ రిలీజ్‌కు ముందే సృష్టిస్తున్న రికార్డులు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేస్తున్నాయి.  ఈసినిమాకు సంబంధించి అమెరికాలో రిలీజ్ కాబోయే థియేటర్ల సంఖ్య గురించి ఆసక్తికరమైన సమాచారం ఇప్పడు బయటకు వచ్చింది.  ఈమూవీకి ఉన్న క్రేజ్ రీత్యా కేవలం అమెరికాలో 209 ప్రాంతాల్లో ‘అజ్ఞాతవాసి’ విడుదల చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. 
 పవన్ ఫైట్స్ స్వీక్వెన్స్
అమెరికాలో ఈరేంజ్‌లో ఒక తెలుగు సినిమా రిలీజ్ కావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. గతంలో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి2' 126 ప్రాంతాల్లో చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రాన్ని 74 లొకేషన్లలో రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమాను 73 లొకేషన్లలో మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్‌ చిత్రం ‘దంగల్‌' 69 లొకేషన్లలో విడుదల అయితే ఆరికార్డులను అన్నింటినీ ‘అజ్ఞాతవాసి’ విడుదల కాకుండానే బ్రేక్ చేస్తోంది. 

దీనితో ఓవర్సీస్ కలెక్షన్స్ విషయంలో ‘అజ్ఞాతవాసి’ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు అన్న అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. అంతేకాకుండా ఈసినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన న్యూస్ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేస్తోంది. పవన్ అభిమానులకే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడ పిచ్చెక్కించే విధంగా ఈమూవీ ఫైట్స్ సీక్వెన్స్‌ ను త్రివిక్రమ్ రూపొందించినట్లు తెలుస్తోంది. 

బయటకు వస్తున్న లీకుల ప్రకారం ఈ మూవీలో ఏడు ఫైట్ సీక్వెన్స్‌ త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు త్రివిక్రమ్ సినిమాలలోని ‘అతడు’ సినిమా రేంజ్ కి మించిన ఫైట్స్ ‘అజ్ఞాతవాసి’ లో దర్శనమిస్తాయని అంటున్నారు. ఈ యాక్షన్ సీన్స్ కోసం భారీ బడ్జెట్ ఖర్చు పెట్టడమే కాకుండా ఈసీన్స్ విషయంలో వచ్చే గ్రాఫిక్స్ క్వాలిటీ చాల అద్భుతంగా ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ‘అజ్ఞాతవాసి’ డేట్ విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈనెల రెండవ వారంలో జరగబోతున్న ప్రపంచ తెలుగు మహాసభల తరువాత మాత్రమే ‘అజ్ఞాతవాసి’ ఆడియో ఫంక్షన్ ఉంటుంది అని అంటున్నారు..  
 



మరింత సమాచారం తెలుసుకోండి: