ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రచురించిన ‘డాక్టర్’ కాలమ్ లో ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ నరేశ్ వడ్లమాని బయటపెట్టిన పవన్ నాల్గవ భార్యగా ఊహించుకుంటున్న ఒక మహిళ మానసిక సమస్యకు సంబంధించిన ఒక ఆసక్తికర కథనం చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది. డాక్టర్ నరేశ్ చెపుతున్న వివరాల ప్రకారం సుమారు ఐదారేళ్ళ క్రితం తన వద్దకు 24 ఏళ్ల వయస్సు ఉన్న ఒక అమ్మాయిని తన వద్దకు తీసుకు వచ్చిన విషయాన్ని బయటపెట్టారు. 

ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ వీరాభిమాని అవ్వడంతో ‘నేనే కాదు పవన్ కూడ నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను వదిలేస్తే వాళ్ళ ఇంటికి వెళతాను’ అంటూ గోల పెడుతున్న పరిస్థుతులలో ఆమెను ఈ డాక్టర్ వద్దకు తీసుకువచ్చారట. ఆమె అప్పట్లో ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగి కూడ అన్న విషయాన్ని ఈ డాక్టర్ చెపుతున్నారు.

అంతేకాదు ఆమె ఒక సందర్భంలో వెళ్ళిన ఒక ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ కూడ రావడం ఆ అమ్మాయిని చూసి పవన్ నవ్వడం ఎదో జరిగిందని ఆమె అప్పట్లో చెపుతూ పవన్ తనను ప్రేమిస్తున్నాడనే భ్రమలో పడిపోయిందట. ఆమె ఆ భ్రమ వల్ల ఏదేదో ఊహించుకుని విపరీతంగా వింతగా ప్రవర్తించడంతో ఆ అమ్మాయికి ఈ డాక్టర్ ఏడాది పాటు వైద్యం చేయడంతో  చికిత్స అనంతరం ఆమె పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్లిపోయి పిల్లాపాపలతో చాలాకాలం ఆనందంగా ఉందట.

అయితే ఆమెకు వచ్చిన ‘ఎరిటోమేనియా’ మానసిక వ్యాధి తిరిగి తిరగాపెట్టడంతో ఆమెకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గుర్తుకు రావడంతో ఆమె భర్త చికిత్స కోసం తన వద్దకు తీసుకు వచ్చిన విషయాన్ని బయటపెట్టారు ఆ డాక్టర్. అంతేకాదు పవన్ కళ్యాణ్ కు మూడుసార్లు పెళ్లి అయినా అది పట్టించుకోకుండా తాను పవన్ నాల్గవ భార్యగా ఉండటానికి తనకు అభ్యంతరం లేదు అంటూ ఆమె ఈ వ్యాది వల్ల మళ్ళీ చెపుతోంది అంటూ ఆ డాక్టర్ ఈ సంచలన విషయాన్ని బయట పెట్టారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతున్నట్లు డాక్టర్ నరేశ్ వెల్లడించారు. పవన్ మ్యానియా అభిమానులలో మాత్రమే కాదు గాలిలో కూడ ఉంటుంది అని ఒక టాప్ హీరో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఈ మానసిక వైద్యుడు చెప్పిన కథనాన్ని చదివిన వారికి గుర్తుకు రావడం సహజం..  



మరింత సమాచారం తెలుసుకోండి: